తెలంగాణ

telangana

ETV Bharat / business

ఒడుదొడుకుల్లో మార్కెట్లు.. లాభాల నుంచి నష్టాల్లోకి..! - లాభాల్లో స్టాక్​మార్కెట్లు

అంతర్జాతీయ సానుకూల పవనాలు, విదేశీ నిధుల ప్రవాహం నేపథ్యంలో ఇవాళ దేశీయ స్టాక్​మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడ్​ ప్రారంభంలో సెన్సెక్స్ 100 పాయింట్లకు పైగా పెరిగింది. అనంతరం.. లాభాల స్వీకరణతో ప్రస్తుతం మార్కెట్ నష్టాల్లోకి జారుకుంది. సెన్సెక్స్​ 90, నిఫ్టీ 20 పాయింట్లకు పైగా నష్టాల్లో ఉంది.

ఒడుదొడుకుల్లో స్టాక్​మార్కెట్లు

By

Published : Nov 1, 2019, 10:47 AM IST

మార్కెట్ బెంచ్​మార్క్ బీఎస్​ఈ సెన్సెక్స్ ప్రారంభ ట్రేడింగ్​లో 100 పాయింట్లకు పైగా పెరిగింది. అనంతరం.. మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో నష్టాల్లోకి జారుకున్నాయి సూచీలు.

తొలుత అంతర్జాతీయంగా సానుకూల పవనాలు, విదేశీ నిధుల ప్రవాహం నేపథ్యంలో ఇన్ఫోసిస్​, హెచ్​డీఎఫ్​సీ ట్విన్స్, ఐసీటీ లాభాలను మూటగట్టుకున్నాయి.

ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 91 పాయింట్లు కోల్పోయి 40 వేల 37 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 19 పాయింట్ల నష్టంతో 11 వేల 858 వద్ద ట్రేడవుతోంది.

లాభనష్టాలు

ఇండస్​ఇండ్ బ్యాంకు, హీరో మోటోకార్ప్​, టెక్​ మహీంద్రా, టాటా స్టీల్, ఐటీసీ, ఇన్ఫోసిస్​ (2.68 శాతం మేర) రాణిస్తున్నాయి. భారతీ ఎయిర్​టెల్, టాటా మోటార్స్, ఎస్​ బ్యాంకు, టీసీఎస్​, ఆర్​ఐఎల్​, ఎస్​బీఐ (1.98 శాతం మేర) నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లు

అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందంపై ఆశలతో షాంఘై, హాంకాంగ్​, సియోల్​ లాభాల్లో కొనసాగుతుండగా, టోక్యో మార్కెట్ నష్టాల్లో ట్రేడవుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​పై దిగువ సభలో అభిశంసన తీర్మానం నెగ్గిన నేపథ్యంలో వాల్​స్ట్రీట్ మిశ్రమ ఫలితాలు నమోదు చేసింది.

రూపాయి

ప్రారంభ ట్రేడింగ్​లో రూపాయి విలువ 4 పైసలు తగ్గి, ఒక డాలరుకు రూ.70.96గా ఉంది.

ముడిచమురు

అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధర 0.07 శాతం పెరిగింది. ప్రస్తుతం బ్యారెల్ ధర 59.66 డాలర్లుగా ఉంది.

ఇదీ చూడండి: 'పెప్సికో ఇండియా'కు కార్పొరేట్ ఎక్సలెన్స్ అవార్డు

ABOUT THE AUTHOR

...view details