తెలంగాణ

telangana

ETV Bharat / business

లాభాల స్వీకరణతో నష్టాల్లో స్టాక్​మార్కెట్లు

మార్కెట్ బెంచ్​మార్క్ బీఎస్​ఈ సెన్సెక్స్ బుధవారం ప్రారంభ ట్రేడింగ్​లో 100 పాయింట్లకు పైగా నష్టపోయింది. నిఫ్టీ 50 పాయింట్లు కోల్పోయి.. 11 వేల 867 వద్ద ఉంది. అంతర్జాతీయ ఒత్తిళ్ల నేపథ్యంలో హెచ్​డీఎఫ్​సీ ట్విన్స్​, ఆర్​ఐఎల్​, ఐటీసీ, టీసీఎస్​లు నష్టపోయాయి.

లాభాల స్వీకరణతో నష్టాల్లో స్టాక్​మార్కెట్లు

By

Published : Nov 6, 2019, 11:14 AM IST

దేశీయ స్టాక్​మార్కెట్​లో 7 రోజుల పాటు వరుస లాభాలకు నిన్నటితో అడ్డుకట్టపడింది. మదుపర్లు ఇప్పటికీ లాభాల స్వీకరణకు మొగ్గుచూపుతున్న నేపథ్యంలో స్టాక్​మార్కెట్లు ఇవాళా నష్టాలతో ప్రారంభమయ్యాయి. అమెరికా-చైనా వాణిజ్య చర్చలపై ఆశలతో అంతర్జాతీయ విపణులు మాత్రం ఆశాజనకంగా కొనసాగుతున్నాయి. ప్రభుత్వం నుంచి దిశాత్మక సూచనలు లేనందున మార్కెట్ సెంటిమెంట్​ దెబ్బతిందని వ్యాపారులు భావిస్తున్నారు.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 154 పాయింట్లు పతనమై 40 వేల 95 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 50 పాయింట్లు కోల్పోయి 11 వేల 867 వద్ద ట్రేడవుతోంది.

లాభనష్టాలు

సన్​ఫార్మా, ఎస్​ బ్యాంకు, కోల్​ ఇండియా, వేదాంత, ఇన్ఫోసిస్​, సిప్లా, జీ ఎంటర్​టైన్​మెంట్​, డాక్టర్​ రెడ్డీస్​ ల్యాబ్స్​ రాణిస్తున్నాయి.

భారతీ ఎయిర్​టెల్, హెచ్​సీఎల్​ టెక్, ఐటీసీ, బజాజ్​​ ఆటో, హెచ్​డీఎఫ్​సీ ట్విన్స్​, టీసీఎస్​, రిలయన్స్, మారుతీ సుజుకి, యాక్సిస్ బ్యాంకు, టైటాన్​ కంపెనీ, మారుతీ ఇన్​ఫ్రాటెల్​ నష్టాల్లో కొనసాగుతున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లు

జపాన్​ నిక్కీ, కోస్పీ లాభాల్లో కొనసాగుతుండగా, హాంగ్​సెంగ్, షాంఘై కాంపోజిట్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. మరోవైపు నిన్న వాల్​స్ట్రీట్ నష్టాలతో ముగిసింది.

రూపాయి విలువ

రూపాయి విలువ 9 పైసలు క్షీణించింది. డాలర్​తో పోలిస్తే మారకం విలువ ప్రస్తుతం 70.78గా ఉంది.

ముడిచమురు

అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధర 0.64 శాతం క్షీణించింది. ప్రస్తుతం బ్యారెల్ ముడిచమురు ధర 62.56 డాలర్లుగా ఉంది.

ఇదీ చూడండి:ఇన్ఫోసిస్​లో 10,000 ఉద్యోగాల కోత!

ABOUT THE AUTHOR

...view details