తెలంగాణ

telangana

ETV Bharat / business

మార్కెట్లకు భారీ నష్టాలు.. సెన్సెక్స్ 394 మైనస్​ - షేర్ మార్కెట్​ వార్తలు

stock market news
షేర్​ మార్కెట్ వార్తలు

By

Published : Aug 20, 2020, 9:30 AM IST

Updated : Aug 20, 2020, 3:44 PM IST

15:42 August 20

బ్యాంకింగ్ షేర్లు డీలా..

మూడు రోజుల లాభాలను మదుపరులు సొమ్ముచేసుకునే పనిలో పడిన నేపథ్యంలో గురువారం భారీ నష్టాలను నమోదు చేశాయి స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 394 పాయింట్లు క్షీణించి 38,220 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 96 పాయింట్లు కోల్పోయి 11,312 వద్దకు చేరింది.

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్ల ప్రతికూలతలు కూడా.. గురువారం నష్టాలకు కారణంగా తెలుస్తోంది. బ్యాంకింగ్ షేర్లు ప్రధానంగా నష్టాలతో ముగిశాయి. ఒడుదొడుకుల్లోనూ విద్యుత్​ షేర్లు రాణించాయి.

  • ఎన్​టీపీసీ, ఓఎన్​జీసీ, పవర్​గ్రిడ్, టాటా స్టీల్, హెచ్​సీఎల్​టెక్​ మాత్రమే సానుకూలంగా ముగిశాయి.
  • హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్​టెల్, ఎం&ఎం, ఇండస్​ఇండ్ బ్యాంక్ నష్టాల్లో ప్రధానంగా ఉన్నాయి.

12:08 August 20

నష్టాల్లో స్థిరంగా సూచీలు..

స్టాక్ మార్కెట్లు మిడ్ సెషన్​ తర్వాత కూడా భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ దాదాపు 280 పాయింట్ల నష్టంతో 38,335 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ దాదాపు 70 పాయింట్లు కోల్పోయి 11,340 వద్ద కొనసాగుతోంది.

ఆర్థిక, టెలికాం, ఆటో షేర్లలో అమ్మకాల ఒత్తిడి ఎక్కువగా కనిపిస్తోంది. విద్యుత్​ షేర్లు సానుకూలంగా స్పందిస్తున్నాయి.

  • ఎన్​టీపీసీ, పవర్​గ్రిడ్, ఓఎన్​జీసీ, టాటా స్టీల్, టెక్​ మహీంద్రా లాభాల్లో ఉన్నాయి.
  • ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, భారతీ ఎయిర్​టెల్​, టైటాన్​, ఎం&ఎం షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

09:08 August 20

38,300 దిగువకు సెన్సెక్స్..

స్టాక్ మార్కెట్ల వరుస లాభాలకు గురువారం బ్రేక్ బడింది. బీఎస్​ఈ-సెన్సెక్స్ 340 పాయింట్లకుపైగా పడిపోయి 38,270 వద్ద ట్రేడవుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 102 పాయింట్లకుపైగా నష్టంతో 11,306 వద్ద కొనసాగుతోంది.

మూడు రోజులుగా నమోదవుతున్న లాభాలను మదుపరులు సొమ్ము చేసుకునే పనిలో పడటం నష్టాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. బ్యాంకింగ్, చమురు, ఆటో షేర్లు ప్రధానంగా నష్టాల్లో ఉన్నాయి. ఐటీ షేర్లు సానుకూలంగా స్పందిస్తున్నాయి.

  • టీసీఎస్​, ఎన్​టీపీసీ, ఇన్ఫోసిస్​, హెచ్​సీఎల్​టెక్ కంపెనీలు మాత్రమే 30 షేర్ల ఇండెక్స్​లో లాభాల్లో ఉన్నాయి.
  • ఐసీఐసీఐ బ్యాంక్, ఓఎన్​జీసీ, హెచ్​డీఎఫ్​సీ, ఇండస్​ఇండ్​ బ్యాంక్, టైటాన్, ఎల్​&టీ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
Last Updated : Aug 20, 2020, 3:44 PM IST

ABOUT THE AUTHOR

...view details