తెలంగాణ

telangana

ETV Bharat / business

చివరి గంటలో అమ్మకాల ఒత్తిడి- నష్టాల్లో ముగిసిన మార్కెట్లు - సెన్సెక్స్​

stock markets Live
స్టాక్ మార్కెట్లు లైవ్​

By

Published : May 5, 2020, 9:35 AM IST

Updated : May 5, 2020, 4:02 PM IST

15:49 May 05

అమ్మేశారు..

వరుసగా రెండో రోజూ నష్టాలతో ముగిశాయి స్టాక్ మార్కెట్లు. ఆరంభం నుంచి సానుకూలంగా స్పందించిన సూచీలు చివరి గంటలో అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. 

సెన్సెక్స్ 262 పాయింట్లు కోల్పోయి 31,453 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 88 పాయింట్ల నష్టంతో 9,206 వద్దకు చేరింది.

  • ఆర్థిక రంగ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి.
  • ఎం&ఎం, పవర్​గ్రిడ్, ఓఎన్​జీసీ, రిలయన్స్, ఎన్​టీపీసీ, హెచ్​సీఎల్​టెక్, నెస్లే ఇండియా షేర్లు లాభపడ్డాయి.
  • ఎస్​బీఐ, బజాజ్ ఫినాన్స్, ఏషియన్ పెయింట్స్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.

14:52 May 05

మళ్లీ నష్టాల్లోకి..

స్టాక్ మార్కెట్లు సెషన్​ ముగింపునకు ముందు నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 50 పాయింట్లకుపైగా నష్టంతో 31,682 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 15 పాయింట్లకుపైగా కోల్పోయి 9,276 వద్ద కొనసాగుతోంది.

  • బ్యాంకింగ్ రంగ షేర్లలో అధికంగా లాభాల స్వీకరణలు జరుగుతుండటం నష్టాలకు కారణంగా తెలుస్తోంది.
  • ఓఎన్​జీసీ, పవర్​గ్రిడ్, ఎం&ఎం, హెచ్​డీఎల్​టెక్, ఎన్​టీపీసీ, రిలయన్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
  • ఎస్​బీఐ, బజాజ్ ఫినాన్స్, ఏషియన్ పెయింట్స్, కోటక్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ప్రధానంగా ఉన్నాయి.

14:01 May 05

కొనసాగుతున్న లాభాలు..

స్టాక్ మార్కెట్లు మిడ్​ సెషన్​ నుంచి స్థిరమైన లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ దాదాపు 280 పాయింట్ల లాభంతో 31,993 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 70 పాయింట్లకుపైగా వృద్ధితో 9,364 వద్ద కొనసాగుతోంది.

ఓఎన్​జీసీ, ఎం&ఎం, ఎన్​టీపీసీ, పవర్​గ్రిడ్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్​సీఎల్​టెక్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

ఏషియన్​ పెయింట్స్, ఎస్​బీఐ, బజాజ్ ఫినాన్స్, ఎల్&టీ, మారుతీ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

11:01 May 05

కాస్త వెనక్కి తగ్గినా.. లాభాల్లోనే..

ఆరంభంలో నమోదైన భారీ లాభాల నుంచి కాస్త వెనక్కితగ్గాయి స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ దాదాపు 290 పాయింట్ల లాభంతో 32,003 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 80 పాయింట్లకు పైగా బలపడి.. 9,376 వద్ద కొనసాగుతోంది. హెవీ వెయిట్ షేర్లు లాభాలకు దన్నుగా నిలుస్తున్నాయి.

  • ఓఎన్​జీసీ, ఎం&ఎం, పవర్​గ్రిడ్, భారతీ ఎయిర్​టెల్, రిలయన్స్ షేర్లు ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.
  • ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫినాన్స్, బజాజ్ ఆటో, హెచ్​డీఎఫ్​సీ, ఎస్​బీఐ, నెస్లే నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
  • హంకాంగ్​ మినహా ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లు నేడు సెలవులో ఉన్నాయి. హాంకాంగ్ సూచీ నేడు లాభాలతో సెషన్ ప్రారంభించింది.
  • కరెన్సీ మార్కెట్​లో రూపాయి నేడు సానుకూలంగా స్పందిస్తోంది. ఆరంభంలో 15 పైసలు బలపడింది రూపాయి. డాలర్​తో పోలిస్తే మారకం విలువ 75.58 వద్ద కొనసాగుతోంది.

08:58 May 05

తేరుకున్న సూచీలు..

30 షేర్ల ఇండెక్స్

స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల నుంచి తెరుకుని నేడు లాభాలతో ప్రారంభమయ్యాయి.  

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్​ 500 పాయింట్లకుపైగా లాభంతో 32,220 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ దాదాపు 150 పాయింట్లు బలపడి 9,443 వద్ద కొనసాగుతోంది.

దేశంలో లాక్​డౌన్ 3.0 ప్రారంభమైనప్పటికీ గ్రీన్​జోన్లలో ఆర్థిక కార్యకలాపాలకు కాస్త సడలింపు ఇవ్వడం వల్ల మదుపరుల సెంటిమెంట్ బలపడి..కొనుగోళ్లపై దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది.

చమురు, బ్యాంకింగ్, వాహన రంగాలు లాభాలకు దన్నుగా నిలుస్తున్నాయి.

30 షేర్ల ఇండెక్స్​లో అన్ని కంపెనీలు లాభాల్లోనే ఉన్నాయి.

Last Updated : May 5, 2020, 4:02 PM IST

ABOUT THE AUTHOR

...view details