తెలంగాణ

telangana

ETV Bharat / business

మార్కెట్ల కొత్త రికార్డు- 44,540 పైకి సెన్సెక్స్

stocks live updates
స్టాక్ మార్కెట్​ వార్తలు

By

Published : Nov 24, 2020, 9:32 AM IST

Updated : Nov 24, 2020, 2:31 PM IST

14:24 November 24

సెన్సెక్స్ 460 ప్లస్

స్టాక్ మార్కెట్లు వరుస లాభాలతో సరికొత్త శిఖరాలకు చేరుతున్నాయి. సెన్సెక్స్ 460 పాయింట్లకుపైగా పెరిగి.. 44,543 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 130 పాయింట్లకుపైగా లాభాంతో 13,060 వద్ద కొనసాగుతోంది. 

  • ఎం&ఎం, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, మారుతీ, ఐటీసీ, టెక్ మహీంద్రా షేర్లు లాభాల్లో ఉన్నాయి.
  • టైటాన్, హెచ్​డీఎఫ్​సీ, అల్ట్రాటెక్ సిమెంట్, ఇండస్​ఇండ్ బ్యాంక్, నెస్లే షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

09:57 November 24

బుల్​ దూకుడు..

స్టాక్ మార్కెట్లలో బుల్​ దూకుడు కొనసాగుతోంది. సెన్సెక్స్ 350 పాయింట్లకుపైగా పెరిగి.. సరికొత్త రికార్డు స్థాయి అయిన 44,430పైకి చేరింది. నిఫ్టీ 90 పాయింట్లకుపైగా లాభంతో చరిత్రలో తొలిసారి 13,020 వద్ద ట్రేడవుతోంది.

ఆటో, ఐటీ, బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్ల జోరు లాభాలకు కారణం.

  • ఎం&ఎం, మారుతీ, టెక్ మహీంద్రా, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.
  • ఓఎన్​జీసీ, సన్​ఫార్మా, టైటాన్​, రిలయన్స్, భారతీ ఎయిర్​టెల్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

09:04 November 24

బ్యాంకింగ్, ఆటో షేర్ల జోరు..

స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ పరిణామాలు, కొవిడ్ వ్యాక్సిన్​పై సానుకూలతలతో మదుపరులు కొనుగోళ్లపై దృష్టి సారిస్తున్నారు.

బీఎస్​ఈ-సెన్సెక్స్ దాదాపు 280 పాయింట్లు పెరిగి 44,355 వద్ద ట్రేడవుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ దాదాపు 70 పాయింట్లు పుంజుకుని 12,926 వద్ద కొనసాగుతోంది.

బ్యాంకింగ్, ఆటో, చమురు, లోహ షేర్లు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.

  • హెచ్​డీఎఫ్​సీ, మారుతీ, ఓఎన్​జీసీ, టాటా స్టీల్, ఎల్​&టీ, యాక్సిస్ బ్యాంక్​ షేర్లు లాభాల బాటలో పయనిస్తున్నాయి.
  • బజాజ్ అటో, హెచ్​డీఎఫ్​సీ, నెస్లే మాత్రమే 30 షేర్ల ఇండెక్స్​లో ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నాయి.
Last Updated : Nov 24, 2020, 2:31 PM IST

ABOUT THE AUTHOR

...view details