మిశ్రమ ముగింపు..
స్టాక్ మార్కెట్లు బుధవారం మిశ్రమంగా ముగిశాయి. ఆరంభ లాభాలను మదుపరులు సొమ్ము చేసుకునే పనిలో పడటం వల్ల.. సెన్సెక్స్ 25 పాయింట్లు కోల్పోయి 37,663 వద్దకు చేరింది. నిఫ్టీ 6 పాయింట్ల లాభంతో 11,102 వద్ద స్థిరపడింది.
- టాటా స్టీల్, టైటాన్, ఎం&ఎం, మారుతీ, భారతీ ఎయిర్టెల్, బజాజ్ ఆటో షేర్లు లాభాలను గడించాయి.
- పవర్‌గ్రిడ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, నెస్లే, ఇన్ఫోసిస్ షేర్లు నష్టాలతో ముగిశాయి.