తెలంగాణ

telangana

ETV Bharat / business

లాభాలతో ముగిసిన మార్కెట్లు- బజాజ్ ఫిన్​సర్వ్ జోరు

STOCK MARKETS LIVE UPDATES
నేటి స్టాక్ మార్కెట్లు

By

Published : Nov 20, 2020, 9:35 AM IST

Updated : Nov 20, 2020, 3:51 PM IST

15:45 November 20

వారాంతంలో లాభాలు..

వారాంతపు సెషన్​లో స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 282 పాయింట్లు బలపడి 43,882 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 87 పాయింట్ల లాభంతో 12,859 వద్దకు చేరింది.

  • బజాజ్ ఫిన్​సర్వ్(9 శాతానికిపైగా), టైటాన్, బజాజ్ ఫినాన్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, భారతీ ఎయిర్​టెల్ షేర్లు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.
  • రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇండస్​ఇండ్ బ్యాంక్, సన్​ఫార్మా, ఓఎన్​జీసీ, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి.

09:01 November 20

12,800పైకి నిఫ్టీ..

స్టాక్ మార్కెట్లు వారాంతపు సెషన్​లో సానుకూలంగా ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 230 పాయింట్లకుపైగా పెరిగి 43,832 వద్ద ట్రేడవుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 70 పాయింట్లకుపైగా లాభంతో 12,846 వద్ద కొనసాగుతోంది.

లోహ, ఐటీ, విద్యుత్ షేర్లకు లభిస్తున్న కొనుగోళ్ల మద్దతు లాభాలకు కారణంగా తెలుస్తోంది.

  • టాటా స్టీల్, బజాజ్ ఫిన్​సర్వ్, ఎన్​టీపీసీ, టైటాన్, బజాజ్​ ఫినాన్స్, టెక్ మహీంద్రా షేర్లు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.
  • ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, మారుతీ సుజుకీ, ఇండస్​ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
Last Updated : Nov 20, 2020, 3:51 PM IST

ABOUT THE AUTHOR

...view details