తెలంగాణ

telangana

ETV Bharat / business

చివరి గంటలో కొనుగోళ్ల జోరు- 12,900పైకి నిఫ్టీ - నిఫ్టీ

SHARE MARKETS NEWS
నేటి స్టాక్​ మార్కెట్లు లైవ్ అప్​డేట్స్

By

Published : Nov 18, 2020, 9:36 AM IST

Updated : Nov 18, 2020, 4:04 PM IST

15:50 November 18

సెన్సెక్స్ 227 ప్లస్..

చివరి గంటలో లభించిన కొనుగోళ్ల మద్దతుతో స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 227 పాయింట్లు బలపడి.. జీవనకాల గరిష్ఠ స్థాయి అయిన 44,180 వద్ద  స్థిరపడింది. నిఫ్టీ 64 పాయింట్ల వృద్ధితో సరికొత్త రికార్డు స్థాయి అయిన 12,938 వద్దకు చేరింది.  

  • ఎం&ఎం, బజాజ్ ఫినాన్స్, ఎల్​&టీ, ఇండస్​ఇండ్ బ్యాంక్, ఎస్​బీఐ షేర్లు లాభాలతో ముగిశాయి.
  • హెచ్​యూఎల్​, టైటాన్​, టీసీఎస్​, ఐటీసీ, భారతీ ఎయిర్​టెల్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.

12:01 November 18

43,900 దిగువకు సెన్సెక్స్​..

స్టాక్ మార్కెట్లు మిడ్ సెషన్​లో నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 100 పాయింట్లకుపైగా తగ్గి.. 43,852 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 30 పాయింట్లకుపైగా పడిపోయి 12,839 వద్ద కొనసాగుతోంది.

ఐటీ, టెలికాం షేర్లలో అమ్మకాల ఒత్తిడి నష్టాలకు కారణంగా తెలుస్తోంది.

  • ఎం&ఎం, ఎల్​&టీ, బజాజ్ ఫినాన్స్, బజాజ్ ఫిన్​సర్వ్, ఎస్​బీఐ, ఇండస్​ఇండ్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.
  • టాటా, భారతీ ఎయిర్​టెల్, ఐటీసీ, టీసీఎస్​, హెచ్​సీఎల్​టెక్ షేర్లు నష్టాల్లో ప్రధానంగా ఉన్నాయి.

09:03 November 18

మదుపరుల్లో అప్రమత్తత..

స్టాక్ మార్కెట్లు బుధవారం మందకొడిగా ప్రారంభమయ్యాయి. ఇటీవలి భారీ లాభాల నేపథ్యంలో ముదపరులు అప్రమత్తత పాటిస్తున్నారు. 

బీఎస్​ఈ-సెన్సెక్స్ 60 పాయింట్లకుపైగా లాభంతో 44,016 వద్ద ట్రేడవుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 15 పాయింట్ల స్వల్ప వృద్ధితో 12,890 వద్ద కొనసాగుతోంది.

  • ఎస్​బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, ఎం&ఎం, ఇండస్​ఇండ్ బ్యాంక్, పవర్​గ్రిడ్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
  • టెక్​ మహీంద్రా, సన్​ఫార్మా, హెచ్​యూఎల్​, టైటాన్, నెస్లే, టీసీఎస్​ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
Last Updated : Nov 18, 2020, 4:04 PM IST

ABOUT THE AUTHOR

...view details