తెలంగాణ

telangana

ETV Bharat / business

అమ్మకాల ఒత్తిడితో లాభాల జోరుకు అడ్డుకట్ట - సెన్సెక్స్

stock market news
స్టాక్ మార్కెట్ వార్తలు

By

Published : Jun 4, 2020, 9:33 AM IST

Updated : Jun 8, 2020, 12:15 PM IST

15:56 June 04

ఆర్థిక షేర్లు పడేశాయ్​..

స్టాక్ మార్కెట్ల వరుస లాభాల జోరుకు అడ్డుకట్టపడింది. గురువారం సెషన్​లో సెన్సెక్స్ 129 పాయింట్లు నష్టంతో 33,981 వద్దకు చేరింది. నిఫ్టీ 32 పాయింట్లు కోల్పోయి 10,029 వద్ద స్థిరపడింది. ఆర్థిక రంగ షేర్లలో అమ్మకాల ఒత్తిడి నష్టాలకు కారణంగా నిపుణులు  చెబుతున్నారు.  

లాభనష్టాల్లోని షేర్లు..

గురువారం సెషన్​లో టెక్ మహీంద్రా, సన్​ఫార్మా, భారతీ  ఎయిర్​టెల్, పవర్​ గ్రిడ్, హెచ్​సీఎల్​ టెక్ షేర్లు లాభపడ్డాయి.

ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫినాన్స్, హెచ్​డీఎఫ్​సీ, ఇండస్​ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి.

13:50 June 04

నష్టాల్లో స్టాక్​ మార్కెట్లు

సెన్సెక్స్ 186 పాయింట్లకుపైగా నష్టంతో 33,923 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 51 పాయింట్లకుపైగా క్షీణంచి 10,010 వద్ద ట్రేడవుతోంది.

12:25 June 04

భారీ నష్టాల నష్టాల దిశగా..

స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల దిశగా పయణిస్తున్నాయి. సెన్సెక్స్ 370 పాయింట్లకుపైగా నష్టంతో 33,737 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 90 పాయింట్లకుపైగా క్షీణంచి 10 వేల మార్క్​ను కోల్పోయింది. ప్రస్తుతం 9,971 వద్ద ట్రేడవుతోంది.

  • బ్యాంకింగ్ రంగ షేర్లలో అమ్మకాల ఒత్తిడి నష్టాలకు కారణంగా తెలుస్తోంది.
  • టెక్ మహీంద్రా, రిలయన్స్, సన్​ఫార్మా, టీసీఎస్, పవర్​ గ్రిడ్, ఇన్ఫోసిస్​, భారతీ ఎయిర్​టెల్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
  • ఇండస్​ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫినాన్స్, హెచ్​డీఎఫ్​సీ, టైటాన్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు ప్రధానంగా నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

11:30 June 04

సెన్సెక్స్ 370 పాయింట్ల నష్టం..

మిడ్​ సెషన్ ముందు నష్టాల్లో ట్రేడవుతున్నాయి స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 130 పాయింట్లకుపైగా నష్టంతో 34 వేల మార్క్​ను కోల్పోయింది. ప్రస్తుతం 33,978 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 30 పాయింట్లకుపైగా క్షీణించి 10,027 వద్ద ట్రేడవుతోంది.

  • ఇటీవల వరుస లాభాలకు కారణమైన ఆర్థిక రంగ షేర్లు ప్రస్తుత సెషన్​లో అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.
  • టెక్​ మహీంద్రా, సన్​ఫార్మా, రిలయన్స్, టీసీఎస్​, పవర్ గ్రిడ్, భారతీ ఎయిర్​టెల్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
  • కోటక్ బ్యాంక్, టైటాన్​, హెచ్​డీఎఫ్​సీ, బజాజ్ ఫినాన్స్, ఎం&ఎం షేర్లు నష్టాల్లో ప్రధనంగా ఉన్నాయి.

10:58 June 04

స్వల్ప లాభాలు..

స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 15 పాయింట్ల స్వల్ప లాభంతో 34,125 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 6 పాయింట్ల వృద్ధితో 10,069 వద్ద ఫ్లాట్​గా ట్రేడింగ్ సాగిస్తోంది.

టెక్​ మహీంద్రా, సన్​ఫార్మా, రిలయన్స్, భారతీఎయిర్​టెల్, టీసీఎస్, టాటా స్టీల్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

టైటాన్​, కోటక్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, హెచ్​డీఎఫ్​సీ, ఓన్​దజీసీ, ఎం&ఎం షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

09:43 June 04

అమ్మకాల ఒత్తిడి..

స్టాక్ మార్కెట్ల వరుస లాభాలకు గురువారం బ్రేక్ పడింది. సెషన్​ ఆరంభంలో సానుకూలంగా స్పందించిన సూచీలు.. కొద్ది సేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 80 పాయింట్లకుపైగా నష్టంతో 34,024 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ దాదాపు 20 పాయింట్లు కోల్పోయి 10,043 వద్ద కొనసాగుతోంది.

వరుసగా ఆరు రోజుల నుంచి సూచీలు లాభాలను గడించిన నేపథ్యంలో మదుపరులు వాటిని సొమ్ముచేసుకునే పనిలో పడటం నష్టాలకు కారణంగా తెలుస్తోంది.

టెక్ మహీంద్రా, సన్​ఫార్మా, హెచ్​సీఎల్ టెక్, టీసీఎస్, బజాజ్ ఆటో షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.

టైటాన్​, హెచ్​డీఎఫ్​సీ, కోటక్ బ్యాంక్, బజాజ్ ఫినాన్స్, ఓఎన్​జీసీ షేర్లు నష్టాల్లో ప్రధానంగా ఉన్నాయి.

09:23 June 04

స్వల్ప లాభాలు..

దేశీయ స్టాక్​ మార్కెట్లు వరుసగా ఏడో రోజూ లాభాల బాటలో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ సానుకూలతలు, లాక్​డౌన్ సడలింపుల నేపథ్యంలో వ్యాపారాలు పుంజుకుంటుండడమే ఇందుకు కారణం.

బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 143 పాయింట్లు లాభపడి 34 వేల 252 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 46 పాయింట్లు వృద్ధిచెంది 10 వేల 107 వద్ద ట్రేడవుతోంది.

లాభనష్టాల్లో..

టెక్ మహీంద్రా, సన్​ఫార్మా, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, టీసీఎస్, రిలయన్స్ రాణిస్తున్నాయి.

టైటాన్, కోటక్ బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ, ఏషియన్ పెయింట్స్, ఎం​ అండ్ ఎం, ఓఎన్​జీసీ నేలచూపులు చూస్తున్నాయి.

Last Updated : Jun 8, 2020, 12:15 PM IST

ABOUT THE AUTHOR

...view details