తెలంగాణ

telangana

ETV Bharat / business

విదేశీ నిధుల ప్రవాహంతో మార్కెట్లకు జోష్

stocks open green
మళ్లీ లాభాల బాటలోకి దేశీయ ​మార్కెట్లు

By

Published : Nov 27, 2019, 9:43 AM IST

Updated : Nov 27, 2019, 10:12 AM IST

10:09 November 27

జీడీపీ వృద్ధి భయాలతో నిన్న స్వల్పంగా నష్టపోయిన దేశీయ స్టాక్​మార్కెట్లు.. ఇవాళ మళ్లీ లాభాలబాట పట్టాయి. అంతర్జాతీయ సానుకూల పవనాలు, నిరంతర విదేశీ పెట్టుబడుల ప్రవాహం, మహారాష్ట్రలో సంకీర్ణ  ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం అవ్వడమే ఇందుకు కారణం.

బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచి సెన్సెక్స్​ 165 పాయింట్లు లాభపడి 40 వేల 990 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 50 పాయింట్లు వృద్ధిచెంది 12 వేల 90 వద్ద ట్రేడవుతోంది.

లాభాల్లో

ఎస్​ బ్యాంకు, టాటా మోటార్స్, ఎమ్​ అండ్ ఎమ్​, హెచ్​డీఎఫ్​సీ, హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు​, మారుతీ సుజుకీ, ఇండస్ఇండ్ బ్యాంకు, వేదాంత, టీసీఎస్​ రాణిస్తున్నాయి.

నష్టాల్లో

జీ ఎంటర్​టైన్​మెంట్​, ఐసీఐసీఐ బ్యాంకు, ఎల్​ అండ్​ టీ, ఐటీసీ, సిప్లా, భారతీ ఇన్​ఫ్రాటెల్, టెక్​ మహీంద్రా, టాటా స్టీల్ నష్టాల బాటలో పయనిస్తున్నాయి.

ఆసియా మార్కెట్లు

అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందంపై ఆశలతో..ఆసియా మార్కెట్లు నిక్కీ, హాంగ్​సెంగ్​, కోస్పీ, షాంగై కాంపోజిట్ లాభాల్లో కొనసాగుతున్నాయి. వాల్​స్ట్రీట్​ నిన్న లాభాలతో ముగిసింది.

రూపాయి విలువ

ప్రస్తుతం రూపాయి విలువ 6 పైసలు పెరిగి ఒక డాలరుకు రూ.71.43గా ఉంది.

ముడిచమురు

అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధర 0.24 శాతం తగ్గింది. ప్రస్తుతం బ్యారెల్ ధర 63.06 డాలర్లుగా ఉంది.
     

 

09:20 November 27

జీడీపీ వృద్ధి భయాలతో నిన్న స్వల్పంగా నష్టపోయిన దేశీయ స్టాక్​మార్కెట్లు.. ఇవాళ మళ్లీ లాభాలబాట పట్టాయి. అంతర్జాతీయ సానుకూల పవనాలు, మహారాష్ట్రలో సంకీర్ణ  ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం అవ్వడమే ఇందుకు కారణం.

బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచి సెన్సెక్స్​ 219 పాయింట్లు లాభపడి 41 వేల 41 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 61 పాయింట్లు వృద్ధిచెంది 12 వేల 99 వద్ద ట్రేడవుతోంది.

లాభనష్టాల్లో

ఎస్​ బ్యాంకు, టాటా మోటార్స్, ఎమ్​ అండ్ ఎమ్​, యూపీఎల్​, మారుతీ సుజుకీ రాణిస్తున్నాయి.

జీ ఎంటర్​టైన్​మెంట్​, సిప్లా, బీపీసీఎల్​, భారతీ ఇన్​ఫ్రాటెల్, డా. రెడ్డీస్ ల్యాబ్​, టెక్​ మహీంద్రా, టాటా స్టీల్ నష్టాల బాటలో పయనిస్తున్నాయి.

ఆసియా మార్కెట్లు

అంతర్జాతీయ సానుకూల పవనాలతో ఆసియా మార్కెట్లు.. నిక్కీ, హాంగ్​సెంగ్​, కోస్పీ, షాంగై కాంపోజిట్ లాభాల్లో కొనసాగుతున్నాయి.

రూపాయి విలువ

ప్రస్తుతం రూపాయి విలువ స్వల్పంగా పెరిగి ఒక డాలరుకు రూ.71.44గా ఉంది.

Last Updated : Nov 27, 2019, 10:12 AM IST

ABOUT THE AUTHOR

...view details