ఇవాళ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు... మధ్యాహ్నానికి లాభాల బాట పట్టాయి. సెన్సెక్ 150 పాయింట్ల నష్టం నుంచి 225 పాయింట్ల లాభంలోకి దూసుకొచ్చింది. ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చేలా ప్రభుత్వం సంస్కరణలు చేపడుతుందన్న ఆశలతో దేశీయ మార్కెట్లు పుంజుకున్నాయి. అమెరికా-చైనా వాణిజ్య చర్చల పునఃప్రారంభం, ఫెడ్ మరోమారు వడ్డీరేట్లు తగ్గిస్తుందనే అంచనాలూ ఇందుకు కారణమే.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 222 పాయింట్లు లాభపడి 37 వేల 204 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 68 పాయింట్లు వృద్ధి చెంది 11 వేల మార్కు ఎగువన ట్రేడవుతోంది.
లాభాల్లో
జేఎస్డబ్ల్యూ స్టీల్, యూపీఎల్, లార్సెన్, ఎస్ బ్యాంకు, హెచ్యూఎల్, ఐసీఐసీఐ బ్యాంకు, కోటక్ మహీంద్రా రాణిస్తున్నాయి.