సెన్సెక్స్ 416 పాయింట్లు ప్లస్
స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 416 పాయింట్లు పుంజుకుని చివరకు 31,743 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 128 పాయింట్ల లాభంతో 9,282 వద్దకు చేరింది.
మ్యూచువల్ ఫండ్లకు ఆర్బీఐ ప్రకటించిన రూ.50 వేల కోట్ల ప్యాకేజీతో ఆర్థిక రంగ షేర్లు నేడు దూసుకెళ్లాయి. వీటికి తోడు కేంద్రం నుంచి భారీ ఆర్థిక ప్యాకేజీ అందొచ్చన్న అంచనాలు నేటి లాభాలకు కారణమయ్యాయి.
ఇండస్ఇండ్ బ్యాంక్ 6.33 శాతం, యాక్సిస్ బ్యాంక్ 5.74 శాతం, కోటక్ బ్యాంక్ 5.15 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 3.85 శాతం బలపడ్డాయి.
ఎన్టీపీసీ 1.13 శాతం, ఎం&ఎం 1.12 శాతం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 0.83 శాతం నష్టాలను మూటగట్టుకున్నాయి.