భయాలున్నా బుల్ జోష్..
సర్వత్రా ప్రతికూలతలు ఉన్నా స్టాక్ మార్కెట్లు గురువారం భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 700 పాయింట్లు బలపడి 34,208 వద్ద స్థిరపడంది. నిఫ్టీ 210 పాయింట్లు పుంజుకుని 10,092 వద్దకు చేరింది.
- సరిహద్దు వివాదాలు, దేశీయ రేటింగ్ తగ్గిస్తూ రేటింగ్ ఏజెన్సీలు నివేదికలు విడుదల చేయడం వంటి ప్రతికూలతల్లోనూ దిగ్గజ సంస్థలు రాణించడం లాభాలకు దన్నుగా నిలిచినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
- బజాజ్ ఫినాన్స్, కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, పవర్ గ్రిడ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ షేర్లు లాభాలను నమోదు చేసాయి.
- ఓఎన్జీసీ, హెచ్‌యూఎల్, టీసీఎస్, భారతీ ఎయిర్టెల్, మారుతీ, సన్‌ఫార్మా షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.