స్టాక్ మార్కెట్లకు లాభాలు ఒక్కరోజు ముచ్చటగానే మిగిలాయి. గురువారం భారీ లాభాలు ఆర్జించిన సూచీలు.. వారాంతపు సెషన్లో మళ్లీ నష్టాలను మూటగట్టుకున్నాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 143 పాయింట్లు కోల్పోయి 36,594 వద్దకు చేరింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 45 పాయింట్ల నష్టంతో 10,768 వద్ద స్థిరపడింది.
ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లు భారీ నష్టాలను నమోదు చేయడం.. మదుపరుల సెంటిమెంట్‌ను దెబ్బతీసినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవలి లాభాలను మదుపరులు సొమ్ముచేసుకునే పనిలో పడ్డట్లు చెబుతున్నారు. వీటికి తోడు కరోనా భయాలు కూడా నష్టాలకు కారణమైనట్లు విశ్లేషిస్తున్నారు.
శుక్రవారం సెషన్లో ఫార్మా, ఎఫ్ఎంసీజీ షేర్లు ప్రధానంగా రాణించాయి. బ్యాంకింగ్ షేర్లు నష్టపోయాయి.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 36,749 పాయింట్ల అత్యధిక స్థాయి, 36,401 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.