భారీ లాభాల్లో మార్కెట్లు..
అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల పవనాలతో దేశీయ సూచీలు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 448 పాయింట్లు పైకెగిసి 38,642 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 117 పాయింట్లు మెరుగుపడి 11,395 పాయింట్లకు చేరుకుంది.
ప్రముఖ ఈక్విటీ సంస్థ సిల్వర్ లేక్ పెట్టుబడులతో రిలయన్స్ షేర్ల విలువ జీవిత కాల గరిష్ఠాన్ని తాకాయి. మరోసారి పెట్టుబడుల వెల్లువ రానుందన్న సూచనలతో మదుపరులు రిలయన్స్ షేర్లపై ఆసక్తి కనబరిచినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
లాభనష్టాల్లో..
ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ, రిలయన్స్, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, ఓఎన్జీసీ లాభాల్లో ఉన్నాయి.
టైటాన్, బజాజ్ ఆటో, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్, టాటా స్టీల్, హిందుస్థాన్ యూనిలివర్ నష్టాల్లో ఉన్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లలో లాభాలు..