తెలంగాణ

telangana

ETV Bharat / business

నష్టాలతో ముగిసిన మార్కెట్లు- సెన్సెక్స్ 323 మైనస్​ - నిఫ్టీ

share markets live
నేటి స్టాక్ మార్కెట్లు

By

Published : Sep 17, 2020, 9:36 AM IST

Updated : Sep 17, 2020, 5:33 PM IST

15:46 September 17

ఒడుదొడుకుల్లోనూ ఐటీ సానుకూలం..

స్టాక్ మార్కెట్లు గురువారం భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 323 పాయింట్లు తగ్గి 38,979.85 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 85 పాయింట్ల నష్టంతో 11,519 వద్ద ముగిసింది.

అంతర్జాతీయంగా, దేశీయంగా ఆర్థిక వృద్ధిపై నెలకొంటున్న అనిశ్చితులు గురువారం నష్టాలకు కారణంగా తెలుస్తోంది.

  • హెచ్​సీఎల్​టెక్, ఇన్ఫోసిస్, మారుతీ, అల్ట్రాటెక్ సిమెంట్, ఓఎన్​జీసీ షేర్లు లాభాలను గడించాయి.
  • బజాజ్ ఫిన్​సర్వ్, పవర్​గ్రిడ్, ఎల్​&టీ, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫినాన్స్​ షేర్లు నష్టలను మూటగట్టుకున్నాయి.

12:35 September 17

అన్ని రంగాల్లో అమ్మకాల ఒత్తిడి..

స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. మిడ్ సెషన్ తర్వాత సెన్సెక్స్ 300 పాయింట్లకుపైగా నష్టంతో 38,996 దిగువన కొనసాగుతోంది. నిఫ్టీ 80 పాయింట్లకుపైగా కోల్పోయి 11,520 వద్ద ట్రేడవుతోంది.

దాదాపు అన్ని రంగాలు నష్టాల్లోకి జారుకున్నాయి. 

  • 30 షేర్ల ఇండెక్స్​లో హెచ్​సీఎల్​టెక్, ఏషియన్ పెయింట్స్, టైటాన్, ఇన్ఫోసిస్, ఓఎన్​జీసీ షేర్లు మాత్రమే లాభాల్లో ఉన్నాయి.
  • టాటా స్టీల్, బజాజ్ ఫినాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, పవర్​గ్రిడ్, బజాజ్ ఫినాన్స్​ షేర్లు నష్టాల్లో ప్రధానంగా ఉన్నాయి.

09:56 September 17

సెన్సెక్స్ 160 మైనస్​..

స్టాక్ మార్కెట్లు ఒడుదొడుకుల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ దాదాపు 160 పాయింట్లు కోల్పోయి 39,145 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 30 పాయింట్లకుపైగా నష్టంతో 11,570 వద్ద ట్రేడవుతోంది. 

ఆర్థిక షేర్లు ప్రధానంగా అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి. ఐటీ షేర్లు సానుకూలంగా స్పందిస్తున్నాయి.

  • హెచ్​సీఎల్​టెక్, టెక్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్, ఓఎన్​జీసీ, ఇన్ఫోసిస్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
  • ఐసీఐసీఐ బ్యాంక్, పవర్​గ్రిడ్, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, బజాజ్ ఆటో, ఐటీసీ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

09:33 September 17

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు- సెన్సెక్స్​ 200 మైనస్

స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్ దాదాపు 216 పాయింట్లు కోల్పోయి 39,086 వద్ద ట్రేడవుతోంది. ఎన్​ఎస్ఈ-నిఫ్టీ 44 పాయింట్లు నష్టపోయి 11,560 వద్ద కొనసాగుతోంది.

Last Updated : Sep 17, 2020, 5:33 PM IST

ABOUT THE AUTHOR

...view details