తెలంగాణ

telangana

ETV Bharat / business

మార్కెట్లలో లాభాల జోరు- 48,550పైకి సెన్సెక్స్ - స్టాక మార్కెట్లు లైవ్

stocks live
స్టాక్ మార్కెట్లు లైవ్

By

Published : Jan 8, 2021, 9:24 AM IST

Updated : Jan 8, 2021, 12:35 PM IST

12:28 January 08

14,300లకు చేరువలో నిఫ్టీ..

స్టాక్ మార్కెట్లు మిడ్​ సెషన్​లో దూసుకుపోతున్నాయి. సెన్సెక్స్ 480 పాయింట్లకుపైగా బలపడి 48,578 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ దాదాపు 160 పాయింట్ల లాభంతో 14,295 వద్ద కొనసాగుతోంది.

అంతర్జాతీయ సానుకూల పరిణామాలు మార్కెట్ల దూకుడుకు కారణంగా తెలుస్తోంది.

  • మారుతీ, టెక్ మహీంద్రా, పవర్​గ్రిడ్​, ఎం&ఎం, ఎన్​టీపీసీ షేర్లు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.
  • హెచ్​డీఎఫ్​సీ, భారతీ ఎయిర్​టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, టైటాన్ షేర్లు స్వల్ప నష్టాల్లో ట్రేడుతున్నాయి.

08:41 January 08

సెన్సెక్స్ 330 ప్లస్..

స్టాక్ మార్కెట్లు వారాంతంలో లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 330 పాయింట్లకు పైగా పెరిగి.. 48,427 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 102 పాయింట్లకుపైగా లాభంతో 14,239 వద్ద కొనసాగుతోంది.

దాదాపు అన్ని రంగాలు సానుకూలంగా స్పందిస్తుండటం లాభాలకు కారణంగా తెలుస్తోంది. ఐటీ, బ్యాంకింగ్​ షేర్లు ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి. అంతర్జాతీయ సానుకూలతలూ లాభాలకు ఊతమందిస్తున్నాయి.

  • ఇండస్​ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, ఓఎన్​జీసీ, టీసీఎస్​, ఎల్​&టీ షేర్లు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.
  • 30 షేర్ల ఇండెక్స్​లో హెచ్​డీఎఫ్​సీ మాత్రమే ఒడుదొడుకులు ఎదుర్కొంటోంది.
Last Updated : Jan 8, 2021, 12:35 PM IST

ABOUT THE AUTHOR

...view details