తెలంగాణ

telangana

ETV Bharat / business

వారాంతంలో ఒడుదొడుకుల్లో ట్రేడవుతున్న సూచీలు - బేర్​

STOCKS LIVE NEWS
స్టాక్​ మార్కెట్లు లైవ్​ న్యూస్​

By

Published : Oct 23, 2020, 9:30 AM IST

Updated : Oct 23, 2020, 12:15 PM IST

12:10 October 23

ఒడుదొడుకుల్లో మార్కెట్లు..

ఆరంభంలో లాభాలతో ప్రారంభమైన స్టాక్​ మార్కెట్లు.. ఒడుదొడుకులకు లోనవుతున్నాయి. సెన్సెక్స్​ 97 పాయింట్ల లాభంతో 40 వేల 656 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 29 పాయింట్లు పెరిగి.. 11 వేల 926 వద్ద ఉంది. 

టాటా స్టీల్​, అదానీ పోర్ట్స్​, మారుతీ సుజుకీ, పవర్​ గ్రిడ్​ కార్పొరేషన్​, టాటా మోటార్స్​ రాణిస్తున్నాయి.

శ్రీ సిమెంట్స్​, అల్ట్రాటెక్​ సిమెంట్​, హెచ్​యూఎల్​, గెయిల్​ డీలాపడ్డాయి.

08:28 October 23

లాభాల్లో స్టాక్​మార్కెట్లు.. నిఫ్టీ 11,900+

స్టాక్​మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 172 పాయింట్లు పెరిగింది. ప్రస్తుతం 40 వేల 730 ఎగువన ఉంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 50 పాయింట్లకుపైగా లాభంతో 11 వేల 950 వద్ద కొనసాగుతోంది. 

టాటా స్టీల్​, ఐఓసీ, సిప్లా, భారతీ ఎయిర్​టెల్​, అదానీ పోర్ట్స్​ లాభాల్లో ఉన్నాయి. ఇన్ఫోసిస్​, గెయిల్​, హెచ్​సీఎల్​ టెక్​, రిలయన్స్​ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. 

Last Updated : Oct 23, 2020, 12:15 PM IST

ABOUT THE AUTHOR

...view details