స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 15 పాయింట్లు బలపడి.. 44,633 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 20 పాయింట్లు పెరిగి 13,134 వద్దకు చేరింది.
అంతర్జాతీయంగా అమెరికా మార్కెట్లు బుధవారం లాభాలతో ముగియడం వల్ల ఆ సానుకూలతలు దేశీయంగా కనిపించాయి. అయితే ఆరంభంలో దూసుకెళ్లిన సూచీలు.. లాభాల స్వీకరణతో స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి.
డేటా సెంటర్లో అంతరాయాల కారణంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డిజిటల్ లావాదేవీలను నిలిపివేయాలని ఆర్బీఐ గురువారం ఆదేశించింది. దీనితో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. ఫలితంగా మార్కెట్ల లాభాలు పరిమితమయ్యాయి.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 44,953 పాయింట్ల అత్యధిక స్థాయి (జీవనకాల గరిష్ఠం), 40,551 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 13,216 పాయింట్ల గరిష్ఠ స్థాయి(సరికొత్త రికార్డు స్థాయి), 13,107 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..