స్టాక్ మార్కెట్ల వరుస లాభాల జోరుకు బ్రేక్ పడింది. మంగళవారం సెషన్లో బీఎస్ఈ-సెన్సెక్స్ 341 పాయింట్ల నష్టంతో 49,161 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 91 పాయింట్లు కోల్పోయి 14,850 వద్దకు చేరింది.
కరోనా సంక్షోభం, రాష్ట్రాల వారీగా లాక్డౌన్, ఇటీవలి వరుస లాభాలను మదుపరులు సొమ్ము చేసుకునే పనిలో పడటం వంటివి నష్టాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూలతలు కూడా ఇందుకు మరో కారణంగా చెబుతున్నారు విశ్లేషకులు.
ఐటీ, లోహ షేర్లు భారీగా పతనమయ్యాయి. విద్యుత్, ఇంధన, ఫార్మా షేర్లు కాస్త రాణించాయి.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 49,304 పాయింట్ల అత్యధిక స్థాయి, 48,988 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 4,900 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 14,771 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.