ప్రపంచ దేశాలను కరోనా వైరస్ కొత్త రకం కలవర పెడుతున్నా.. స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 453 పాయింట్లు బలపడి 46,007 వద్దకు చేరింది. ఎన్ఎస్ఈ- నిఫ్టీ 138 పాయింట్లు పెరిగి 13,466 వద్ద స్థిరపడింది.
సోమవారం రికార్డు స్థాయిలో పడిపోయిన మార్కెట్లు.. మంగళవారం సెషన్ ప్రారంభంలోనూ భారీ ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి. అయితే ఐటీ, ఫార్మా షేర్లు సానుకూలంగా స్పందించడం, మిడ్ సెషన్ తర్వాత బ్యాంకింగ్ షేర్లు తేరుకోవడం వంటి కారణాలతో మార్కెట్లు లాభాలను నమోదు చేశాయి.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 46,080 పాయింట్ల అత్యధిక స్థాయి, 45,112 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 13,492 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 13,192 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.