తెలంగాణ

telangana

ETV Bharat / business

దూసుకెళ్లిన స్టాక్​ మార్కెట్లు- సెన్సెక్స్ 917 పాయింట్లు వృద్ధి

దేశీయ స్టాక్​మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. దేశ ఉత్పత్తి రంగ కార్యకలాపాలు 8 ఏళ్ల గరిష్ఠానికి చేరుకోవడం, అంతర్జాతీయ సానుకూలతలు కలిసి రావడమే ఇందుకు కారణం.

stocks close green
భారీ లాభాలు మూటగట్టుకున్న మార్కెట్లు

By

Published : Feb 4, 2020, 3:43 PM IST

Updated : Feb 29, 2020, 3:50 AM IST

అంతర్జాతీయ సానుకూలతలకు తోడు దేశీయ ఉత్పత్తి రంగ కార్యకలాపాలు 8 ఏళ్ల గరిష్ఠానికి చేరుకున్న నేపథ్యంలో మదుపరుల సెంటిమెంట్ బలపడింది. దీనితో ఓ పక్క ఆర్​బీఐ పరపతి విధాన సమీక్ష జరుగుతున్నా... మదుపరులు దూకుడు ప్రదర్శించారు. ఫలితంగా దేశీయ మార్కెట్ల పంట పండింది.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 917 పాయింట్లు వృద్ధిచెంది 40,789 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 271 పాయింట్లు లాభపడి 11,979 వద్ద స్థిరపడింది.

లాభనష్టాల్లో..

టైటాన్​, ఐటీసీ, హెచ్​డీఎఫ్​సీ, బజాజ్​ ఫైనాన్స్​, టాటా స్టీల్, హీరోమోటోకార్ప్​, పవర్ గ్రిడ్​కార్ప్, ఎమ్​ అండ్ ఎమ్​, రిలయన్స్ ఇండస్ట్రీస్ రాణించాయి.
బజాజ్​ ఆటో, జీ ఎంటర్​టైన్​మెంట్, ఎస్​ బ్యాంకు నష్టపోయాయి.

ఆసియా మార్కెట్లు

కరోనాతో విలవిలలాడుతున్న చైనాకు అక్కడి కేంద్ర బ్యాంకు ఆర్థిక ఉద్దీపన అందించడం సహా ముడిచమురు ధరలు తగ్గిన ఫలితంగా మదుపరుల సెంటిమెంటు బలపడింది. ఫలితంగా ఆసియా మార్కెట్లు.. నిక్కీ, షాంగై కాంపోజిట్​, హాంగ్​సెంగ్​, కోస్పీ లాభపడ్డాయి. ఐరోపా మార్కెట్లు కూడా లాభాలతో ప్రారంభమయ్యాయి.

బలపడిన రూపాయి

రూపాయి విలువ 16 పైసలు పెరిగి, ఒక డాలరుకు రూ.71.22గా ఉంది.

ముడిచమురు

అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధర 0.96 శాతం పెరిగింది. ప్రస్తుతం బ్యారెల్ ధర 54.97 డాలర్లుగా ఉంది.

ఇదీ చూడండి: 'అరవింద' సమేత అమెరికా కంపెనీలు..!

Last Updated : Feb 29, 2020, 3:50 AM IST

ABOUT THE AUTHOR

...view details