తెలంగాణ

telangana

ETV Bharat / business

చమురు ధరల తగ్గుదలతో.. మార్కెట్లకు లాభాల పంట - చమురు ధరల తగ్గుదలతో.. మార్కెట్లకు లాభాల పంట

అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గడం, కరోనాతో బాధపడుతున్న చైనాకు అక్కడి కేంద్ర బ్యాంకు ఉద్దీపనలు ప్రకటించిన నేపథ్యంలో మదుపరుల సెంటిమెంటు బలపడింది. ఫలితంగా ఇవాళ కూడా దేశీయ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి.

stockmarket today
చమురు ధరల తగ్గుదలతో.. మార్కెట్లకు లాభాల పంట

By

Published : Feb 5, 2020, 9:58 AM IST

Updated : Feb 29, 2020, 6:08 AM IST

దేశీయ స్టాక్​మార్కెట్లు ఇవాళ కూడా లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ సానుకూలతలకు తోడు చమురు ధరలు క్షీణించడమే ఇందుకు కారణం.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 110 పాయింట్లు లాభపడి 40 వేల 900 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 39 పాయింట్లు వృద్ధిచెంది 12 వేల 19 వద్ద ట్రేడవుతోంది.

లాభనష్టాల్లో

టాటా మోటార్స్, ఎమ్​ అండ్ ఎమ్​, హెచ్​సీఎల్​, భారతీ ఇన్​ఫ్రాటెల్, బీపీసీఎల్​, బజాజ్​ ఆటో, యూపీఎల్​, లార్సెన్ అండ్ టుబ్రో, భారతీ ఇన్​ఫ్రాటెల్ రాణిస్తున్నాయి.

జీ ఎంటర్​టైన్​మెంట్​, ఐటీసీ, ఎస్​ బ్యాంకు, ఇన్ఫోసిస్​, హీరో మోటోకార్ప్, ఏసియన్ పెయింట్స్, టైటాన్​, హెచ్​డీఎఫ్​సీ నష్టాల్లో కొనసాగుతున్నాయి.

ఆసియా మార్కెట్లు

చైనాకు అక్కడి కేంద్ర బ్యాంకు ఆర్థిక ఉద్దీపన ప్రకటించడం, చమురు ధరలు తగ్గిన నేపథ్యంలో ఆసియా మార్కెట్లు రాణిస్తున్నాయి. ప్రస్తుతం నిక్కీ, హాంగ్​సెంగ్​, కోస్పీ, షాంఘై కాంపోజిట్​ లాభాల్లో ట్రేడవుతున్నాయి. వాల్​స్ట్రీట్​ కూడా నిన్న భారీ లాభాలతో ముగిసింది.

రూపాయి విలువ

రూపాయి విలువ 4 పైసలు పెరిగి ఒక డాలరుకు రూ.71.21గా ఉంది.

ముడిచమురు

అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధర 1.15 శాతంపెరిగింది. ప్రస్తుతం బ్యారెల్ ధర 54.58 డాలర్లుగా ఉంది.

ఇదీ చూడండి: ఎండీఆర్‌ జీరో కావాలి: నందన్‌ నీలేకని

Last Updated : Feb 29, 2020, 6:08 AM IST

ABOUT THE AUTHOR

...view details