అమెరికాలో నిరుద్యోగం రేటు 50 ఏళ్ల కనిష్ఠానికి పడిపోయిందన్న వార్తలు.... దేశీయ స్టాక్ మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపాయి. మాంద్యం ముప్పు నుంచి అగ్రరాజ్యం గట్టెక్కిందన్న అంచనాలతో మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. బ్యాంకింగ్, ఆర్థిక రంగాల షేర్లు ప్రధానంగా లాభాల్లో కొనసాగుతున్నాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 200పాయింట్లకుపైగా లాభంతో 37వేల 895 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 50 పాయింట్లకుపైగా లాభపడి 11 వేల 230 వద్ద కొనసాగుతోంది.