స్టాక్ మార్కెట్లకు ఈ వారం.. ద్రవ్యోల్బణం గణాంకాలు, కరోనా వ్యాక్సిన్ వార్తలు, లాక్డౌన్ మినహాయింపు వంటి అంశాలు కీలకం కానున్నాయంటున్నారు నిపుణులు.
మే నెలకు సంబంధించి ద్రవ్యోల్బణం గణాంకాలు ఈ వారం విడుదలవనున్నాయి. దేశీయంగా ఆర్థిక విషయాల్లో ఇది కీలక అంశమని జియోజిత్ ఫినాన్షియల్ సర్వీసెస్ పరిశోధన విభాగాధిపతి వినోద్ నాయర్ పేర్కొన్నారు. అంతర్జాతీయంగా అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల నిర్ణయం కూడా మార్కెట్లను ప్రభావితం చేసే ప్రధాన అంశమని వివరించారు.