తెలంగాణ

telangana

ETV Bharat / business

వృద్ధి రేటుపై ఆందోళనలు- మార్కెట్లకు నష్టాలు - నిప్టీ

దేశీయ, అంతర్జాతీయ ప్రతికూలతలతో స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ 323 పాయింట్లు తగ్గి.. 39 వేల మార్క్​ను కోల్పోయింది. నిఫ్టీ 85 పాయింట్లు క్షీణించింది.

Share Markets today
నేటి స్టాక్ మార్కెట్లు

By

Published : Sep 17, 2020, 3:50 PM IST

Updated : Sep 17, 2020, 5:39 PM IST

స్టాక్ మార్కెట్ల లాభాల జోరుకు గురువారం బ్రేక్ పడింది. బీఎస్ఈ-సెన్సెక్స్ 323 పాయింట్లు తగ్గి 38,980 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 85 పాయింట్ల నష్టంతో 11,519 వద్దకు చేరింది.

కరోనా నేపథ్యంలో కుదేలైన ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణపై ఫెడరల్ రిజర్వు ఆందోళనతో.. అమెరికా మార్కెట్లు బుధవారం నష్టాలను నమోదు చేశాయి. ఆ ప్రభావం దేశీయ సూచీలపైనా పడినట్లు తెలుస్తోంది. మరోవైపు దేశీయ ఆర్థిక వృద్ధి రేటుపై రేటింగ్ ఏజెన్సీలు విడుదల చేస్తున్న ప్రతికూల అంచనాల నేపథ్యంలో మదుపరులు అమ్మకాలపై దృష్టి సారించినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

నేటి మార్కెట్ల తీరు..

ఇంట్రాడే సాగిందిలా

సెన్సెక్స్ 39,234 పాయింట్ల అత్యధిక స్థాయి, 38,926 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 11,587 పాయింట్ల గరిష్ఠ స్థాయి;11,498 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

హెచ్​సీఎల్​టెక్, ఇన్ఫోసిస్, మారుతీ, అల్ట్రాటెక్ సిమెంట్, ఓఎన్​జీసీ షేర్లు లాభాలను గడించాయి.

బజాజ్ ఫిన్​సర్వ్, పవర్​గ్రిడ్, ఎల్​&టీ, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫినాన్స్​ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.

ఆసియా మార్కెట్లు

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో షాంఘై, టోక్యో, సియోల్, హాంకాంగ్​ సూచీలూ గురువారం నష్టాలను నమోదు చేశాయి.

రూపాయి, ముడి చమురు

కరెన్సీ మార్కెట్​లో రూపాయి గురువారం 14 పైసలు తగ్గింది. దీనితో డాలర్​తో పోలిస్తే మారకం విలువ రూ.73.66 వద్దకు చేరింది.

ముడి చమురు ధరల సూచీ-బ్రెంట్ భారీగా 0.33 శాతం తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్​లో బ్యారెల్ ముడి చమురు ధర 42.08 డాలర్లుగా ఉంది.

ఇదీ చూడండి:హ్యుమన్ క్యాపిటల్ ఇండెక్స్​లో భారత్@116

Last Updated : Sep 17, 2020, 5:39 PM IST

ABOUT THE AUTHOR

...view details