అంతర్జాతీయ ప్రతికూలతలు, కరోనా భయాల నేపథ్యంలో మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపగా స్టాక్మార్కెట్లు బుధవారం భారీ నష్టాల్లో ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 627 పాయింట్లు క్షీణించింది. 49,509 వద్దకు చేరింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 154 పాయింట్లు కోల్పోయి 14,690 వద్ద స్థిరపడింది.
వేర్వేరు రాష్ట్రాల్లో రాత్రి కర్ఫ్యూ అమలు, మహారాష్ట్రలో లాక్డౌన్ విధించవచ్చని అక్కడి అధికార యంత్రాంగం సంకేతాలు ఇవ్వడం వంటి పరిణామాలతో పెట్టుబడిదారులు జాగ్రత పడ్డారని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 50,050 పాయింట్ల అత్యధిక స్థాయి, 49,442 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.