స్టాక్ మార్కెట్లపై బేర్ పంజా సోమవారం కూడా కొనసాగింది. బీఎస్ఈ-సెన్సెక్స్ 531 పాయింట్లు తగ్గి 48,347 వద్దకు చేరింది. ఎన్ఎస్ఈ- నిఫ్టీ 133 పాయింట్లు కోల్పోయి 14,238 వద్ద స్థిరపడింది. మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం, రిలయన్స్ షేరు భారీగా నష్టపోవడం కారణంగా మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి.
దాదాపు అన్ని రంగాల ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి. ఐటీ,ఆటో షేర్లు అత్యధిక నష్టాలను నమోదు చేశాయి.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 49,263 పాయింట్ల అత్యధిక స్థాయి, 48,274 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 14,491 పాయింట్ల గరిష్ఠ స్థాయి 14,223 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.