అంతర్జాతీయ సానుకూల పవనాలతో స్టాక్ మార్కెట్లు బుధవారం సల్వ లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 20 పాయింట్లు మెరుగుపడి 40వేల 365కు చేరింది. 9 పాయింట్ల వృద్ధితో నిఫ్టీ 11వేల 922కు పెరిగింది.
అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఒప్పందం జరుగుందో లేదో అనే సందేహాలు, హాంకాంగ్‌లో రాజకీయ అనిశ్చితి వంటి కారణాలు కూడా మార్కెట్లపై ప్రభావాన్ని చూపుతున్నాయి.