ఐసీఐసీఐ బ్యాంక్ 11 శాతం పతనం..
స్టాక్ మార్కెట్లు నేడు రికార్డు స్థాయి నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 2002 పాయింట్ల కోల్పోయి 31,715 వద్దకు చేరింది. నిఫ్టీ 566 పాయింట్ల క్షీణతతో 9,293 వద్ద స్థిరపడింది.
ఆర్థిక, వాహన, లోహ, ఐటీ రంగ షేర్లు అత్యధికంగా నష్టపోయాయి.
30 షేర్ల ఇండెక్స్‌లో భారతీ ఎయిర్టెల్, సన్‌ఫార్మా షేర్లు లాభాలను గడించాయి. ఐసీఐసీఐ బ్యాంక్ (10.96 శాతం), బజాజ్ ఫినాన్స్(10.21 శాతం), హెచ్డీఎఫ్సీ (10.08 శాతం), ఇండస్ఇండ్ బ్యాంక్ (9.58 శాతం), యాక్సిస్ బ్యాంక్(9.40 శాతం) షేర్లు భారీగా నష్టాలను నమోదు చేశాయి.