తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆరంభంలో ఆటుపోట్లు.. చివరకు లాభాలు - నిఫ్టీ

stocks today
నేటి స్టాక్ మార్కెట్లు

By

Published : May 6, 2020, 9:33 AM IST

Updated : May 6, 2020, 4:02 PM IST

15:59 May 06

లాభాలొచ్చాయ్​..

ఆటుపోట్ల ట్రేడింగ్​లో స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్​ 232 పాయింట్లు బలపడి 31,686 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 65 పాయింట్ల లాభంతో 9,271 వద్దకు చేరింది.

ఎం&ఎం, బజాజ్ ఫినాన్స్, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, భారతీ ఎయిర్​టెల్​, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి.

ఐటీసీ, హెచ్​యూఎల్​, టీసీఎస్​, ఇన్ఫోసిస్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.

11:18 May 06

30 షేర్ల ఇండెక్స్

భారీ లాభాల దిశగా పరుగు..

స్టాక్ మార్కెట్లు భారీ లాభాల దిశగా పయణిస్తున్నాయి. సెన్సెక్స్ 410 పాయింట్లకు పైగా వృద్ధితో ప్రస్తుతం 31,866 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ దాదాపు 120 పాయింట్ల లాభంతో 9,322 వద్ద కొనసాగుతోంది.

  • దాదాపు అన్ని రంగాలు లాభాల్లోనే కొనసాగుతున్నాయి.
  • హీరో మోటోకార్ప్, హెచ్​డీఎఫ్​సీ, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, బజాజ్ ఫినాన్స్, ఎన్​టీపీసీ ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.
  • ఐటీసీ, టైటాన్, యాక్సిస్ బ్యాంక్​లు మాత్రమే 30 షేర్ల ఇండెక్స్​లో నష్టాల్లో ఉన్నాయి.

10:18 May 06

తేరుకున్న సూచీలు..

స్టాక్ మార్కెట్లు నష్టాల నుంచి తేరుకున్నాయి. సెన్సెక్స్ దాదాపు 240 పాయింట్లకుపైగా లాభంతో ప్రస్తుతం 31,697 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 70 పాయింట్లకుపైగా వృద్ధితో 9,280 వద్ద కొనసాగుతోంది.

దేశవ్యాప్తంగా లాక్​డౌన్ కొనసాగుతున్నప్పటికీ చాలా ప్రాంతాల్లో షరత్తులతో కూడిన సడలింపులు ఇచ్చింది కేంద్రం. ఫలితంగా ఇప్పటికే పలు వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో మదుపరుల సెంటిమెంట్ బలపడి కీలక రంగాల్లో కొనుగోళ్లు జరుపుతున్నారు. ముఖ్యంగా హెవీ వెయిట్​ షేర్లు సానుకూలంగా స్పందిస్తుండటం లాభాలకు కలిసొస్తున్నట్లు తెలుస్తోంది.

  • భారతీ ఎయిర్​టెల్​, హీరో మోటోకార్ప్, టాటా స్టీల్, హెచ్​డీఎఫ్​సీ, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, ఎన్​టీపీసీ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
  • ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్, టైటాన్, ఏషియన్ పెయింట్స్ నష్టాల్లో కొనసాగుతున్నాయి.
  • ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లైన షాంఘై, హాంకాంగ్, సియోల్ సూచీలు నేడు లాభాలతో సెషన్ ప్రారంభించాయి. టోక్యో సూచీ నేడు సెలవులో ఉంది.

08:56 May 06

మారని తీరు..

స్టాక్ మార్కెట్లు నేడు ఒడుదొడుకుల్లో ప్రారంభమయ్యాయి. ఎఫ్​ఎంసీజీ, బ్యాంకింగ్, ఐటీ, ఆటో రంగాల్లో అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్​ 210 పాయింట్లకుపైగా నష్టంతో 31,239 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ దాదాపు 60 పాయింట్లు కోల్పోయి 9,142 వద్ద కొనసాగుతోంది.

ఓఎన్​జీసీ, భారతీఎయిర్​టెల్, హెచ్​డీఎఫ్​సీ, రిలయన్స్, ఎన్​టీపీసీ షేర్లు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.

ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్, హెచ్​సీఎల్​టెక్, టైటాన్, మారుతీ, ఏషియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా, బజాజ్ ఆటో షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

Last Updated : May 6, 2020, 4:02 PM IST

ABOUT THE AUTHOR

...view details