తెలంగాణ

telangana

ETV Bharat / business

అంతర్జాతీయ ప్రతికూలతలతో కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు - సెన్సెక్స్

stock markets today
నేటి స్టాక్ మార్కెట్లు

By

Published : Jul 14, 2020, 9:25 AM IST

Updated : Jul 14, 2020, 3:54 PM IST

15:45 July 14

భారీ పతనం..

స్టాక్ మార్కెట్లకు లాభాలు ఒక్క రోజు ముచ్చటగానే మిగిలాయి. మంగళవారం సెషన్​లో సెన్సెక్స్ 661 పాయింట్లు కోల్పోయి.. 36,033 వద్దకు చేరింది. నిఫ్టీ 195 పాయింట్ల నష్టంతో 10,607 వద్దకు చేరింది.

అంతర్జాతీయ ప్రతికూలతలు నష్టాలకు ప్రధాన కారణం.

14:13 July 14

36,200 దిగువకు సెన్సెక్స్...

స్టాక్ మార్కెట్లలో భారీ నష్టాలు కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 590 పాయింట్లకుపైగా కోల్పోయి 36,102 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 180 పాయింట్లకుపైగా నష్టంతో 10,621 వద్ద కొనసాగుతోంది.

  • ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లన్నీ ఒడుదొడుకులు ఎదుర్కొంటుండటం వల్ల ఆ ప్రభావం దేశీయంగా పడిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఆర్థిక, ఆటో రంగాల్లో మదుపరులు భారీగా అమ్మకాలు జరుపుతుండటం నష్టాలను మరింత పెంచుతున్నట్లు తెలుస్తోంది.
  • భారతీ ఎయిర్​టెల్, టైటాన్​లు మాత్రమే 30 షేర్ల ఇండెక్స్​లో లాభాల్లో ఉన్నాయి.
  • ఇండస్​ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, మారుతీ, ఎస్​బీఐ, హెచ్​డీఎఫ్​సీ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

10:55 July 14

భారీ నష్టాల్లో మార్కెట్లు..

స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ దాదాపు 500 పాయింట్లు కోల్పోయి 36,195 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 140 పాయింట్లకు పైగా నష్టంతో 10,657 వద్ద కొనసాగుతోంది.

  • అన్ని రంగాల్లో భారీగా నమోదవుతున్న అమ్మకాల ఒత్తిడి నష్టాలకు ప్రధాన కారణం.
  • 30 షేర్ల ఇండెక్స్​లో ఇన్ఫోసిస్, నెస్లే కంపెనీలు మాత్రమే సానుకూలగా స్పందిస్తున్నాయి.
  • ఇండస్​ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫినాన్స్, హెచ్​డీఎఫ్​సీ, ఎస్​బీఐ షేర్లు భారీ నష్టాల్లో ఉన్నాయి.

09:07 July 14

36,500 దిగువకు సెన్సెక్స్​..

స్టాక్ మార్కెట్లు మంగళవారం ఒడుదొడుకుల్లో సెషన్ ప్రారంభించాయి. ఆర్థిక షేర్లలో నమోదవుతున్న అమ్మకాలతో బీఎస్​ఈ-సెన్సెక్స్ దాదాపు 260 పాయింట్ల నష్టంతో 36,434 వద్ద కొసాగుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ దాదాపు 80 పాయింట్లు కోల్పోయి 10,725 వద్ద ట్రేడవుతోంది.

  • ఐటీ మినహా దాదాపు అన్ని రంగాల్లో అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది. 
  • హెచ్​సీఎల్​టెక్, ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్, టీసీఎస్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
  • హెచ్​డీఎఫ్​సీ, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, బజాజ్ ఫినాన్స్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ప్రధానంగా ఉన్నాయి.
Last Updated : Jul 14, 2020, 3:54 PM IST

ABOUT THE AUTHOR

...view details