తెలంగాణ

telangana

ETV Bharat / business

మార్కెట్ల రికార్డు: సెన్సెక్స్ 610+, 15,300 పైకి నిఫ్టీ - నిఫ్టీ

stocks live today
స్టాక్ మార్కెట్లు లైవ్​

By

Published : Feb 15, 2021, 9:31 AM IST

Updated : Feb 15, 2021, 3:43 PM IST

15:39 February 15

రికార్డు పరుగులు

స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్​ 610 పాయింట్లు బలపడి చరిత్రలో తొలిసారి 52,154 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 151 పాయింట్లు పెరిగి జీవనకాల గరిష్ఠమైన 15,315 వద్దకు చేరింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

  • యాక్సిస్​ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫినాన్స్, ఇండస్​ఇండ్ బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ షేర్లు లాభాలను గడించాయి.  
  • డాక్టర్ రెడ్డీస్, టీసీఎస్​, హెచ్​యూఎల్​, ఏషియన్​ పెయింట్స్, టెక్ మహీంద్రా షేర్లు నష్టపోయాయి.

09:15 February 15

బ్యాంకింగ్ షేర్లు భళా

స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. బ్యాంకింగ్ షేర్ల అండతో బీఎస్​ఈ-సెన్సెక్స్ 490 పాయింట్లకు పైగా పెరిగి నూతన రికార్డు స్థాయి అయిన 52,036 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా 120 పాయింట్లకుపైగా లాభంతో సరికొత్త గరిష్ఠమైన 15,286 వద్ద కొనసాగుతోంది.

  • ఇండస్​ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, భారతీ ఎయిర్​టెల్ షేర్లు భారీ లాభాల్లో ఉన్నాయి.
  • ఓఎన్​జీసీ, టెక్​ మహీంద్రా, ఎం&ఎం, హెచ్​సీఎల్​టెక్​, సన్​ఫార్మా, టీసీఎస్​ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
Last Updated : Feb 15, 2021, 3:43 PM IST

ABOUT THE AUTHOR

...view details