కరోనా భయాలు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను కుదిపేస్తున్న నేపథ్యంలో మాంద్యం రావచ్చనే ఆందోళనలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు వరుసగా భారీ నష్టాలను నమోదు చేస్తున్నాయి.
కరోనా సహా ఆర్థిక మందగమనం భయాలతో గత నెల నుంచే మార్కెట్లు ఒడుదొడుకుల్లో కొనసాగుతున్నప్పటికీ.. నెలాఖరు(ఫిబ్రవరి 28) నుంచి రికార్డు స్థాయి నష్టాల్లోకి జారుకున్నాయి.
- ఈ ఏడాది జనవరి 14న సెన్సెక్స్ జీవనకాల గరిష్ఠం 41,953 వద్ద, నిఫ్టీ జనవరి 16న జీవనకాల గరిష్ఠం 12,355 పాయింట్ల వద్ద ఉన్నాయి. సెన్సెక్స్ ప్రస్తుతం (మార్చి 18) 28,870 వద్ద, నిఫ్టీ 8,469 వద్ద స్థిరపడ్డాయి.