కరోనా దెబ్బకు స్టాక్ మార్కెట్ల 'లెక్కలు' తారుమారు - స్టాక్ మార్కెట్ వార్తలు
దేశీయ స్టాక్ మార్కెట్లు గత రెండు వారాల నుంచి భారీ సంక్షోభంలో కొనసాగుతున్నాయి. కరోనా భయాలతో ఫిబ్రవరి 28న మొదలైన పతనం.. ఇప్పటికీ కొనసాగుతునే ఉంది. స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్ ఎలా సాగిందనే వివరాలు క్లుప్తంగా మీకోసం.
కరోనా దెబ్బకు స్టాక్ మార్కెట్లు పతనం లెక్కలు ఇవే
By
Published : Mar 12, 2020, 5:55 PM IST
|
Updated : Mar 12, 2020, 7:27 PM IST
గతంలో ఎన్నడూ లేనంతగా స్టాక్ మార్కెట్లు నష్టాలను నమోదు చేస్తున్నాయి. ఈ ఏడాది జనవరిలో 42వేల మార్క్‌ను దాటి సరికొత్త గరిష్ఠానికి చేరిన సెన్సెక్స్.. నేడు 32,778 పాయింట్ల అత్యల్ప స్థాయికి పడిపోయింది. నిఫ్టీ 9,590 వద్ద స్థిరపడింది.
గతనెలలో కరోనా భయాలు కొనసాగినప్పటికీ.. స్టాక్ మార్కెట్లు స్వల్ప ఒడుదొడుకులనే ఎదుర్కొన్నాయి. అయితే ఫిబ్రవరి 28 తర్వాత.. రికార్డు స్థాయి నష్టాల్లోకి జారుకున్నాయి.
ఈ ఏడాది జనవరి 14న సెన్సెక్స్ జీవనకాల గరిష్ఠం 41,953 వద్ద, నిఫ్టీ జనవరి 16న జీవనకాల గరిష్ఠం 12,355 పాయింట్ల వద్ద ఉన్నాయి. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.