Stock Market Close
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా ఐదో సెషన్లో నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 383, నిఫ్టీ 114 పాయింట్లు కోల్పోయాయి. రష్యా- ఉక్రెయిన్ ఉద్రిక్త పరిస్థితులు.. మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి.
15:38 February 22

12:21 February 22
ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధ మేఘాలు అలుముకున్న నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. ఉదయం సెషన్తో పోల్చితే నష్టాలు కాస్త తగ్గాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 800 పాయింట్ల కోల్పోయి 56,883 వద్ద ఉంది. నిఫ్టీ 231 పాయింట్లు క్షీణించి 16,976 వద్ద కదలాడుతోంది.
ఓఎన్జీసీ, బజాజ్ ఆటో షేర్లు మాత్రమే స్వల్ప లాభాల్లో ఉన్నాయి. మిగతా అన్ని రంగాల షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
09:13 February 22
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
Stock markets live updates: స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 969 పాయింట్లు కోల్పోయి 56,713 పాయింట్లకు పడిపోయింది. నిఫ్టీ 274 పాయింట్లు కుప్పకూలి 16,932 వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు, రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధ వాతావరణం మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి.
ఓఎన్జీసీ మినహా దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాల బాటలోనే పయనిస్తున్నాయి.