తెలంగాణ

telangana

ETV Bharat / business

మార్కెట్లకు స్వల్ప నష్టాలు- 58,200 దిగువకు సెన్సెక్స్​ - stock market latest news

Stock markets live updates
స్టాక్​ మార్కెట్​

By

Published : Sep 13, 2021, 9:35 AM IST

Updated : Sep 13, 2021, 3:43 PM IST

15:41 September 13

స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 127 పాయింట్లు తగ్గి 58,177వద్ద స్థిరపడింది. నిఫ్టీ14 పాయింట్ల అతి స్వల్ప నష్టంతో 17,355 వద్దకు చేరింది.

  • టాటా స్టీల్​, కోటక్ మహీంద్రా బ్యాంక్, టీసీఎస్​, బజాజ్ ఫిన్​సర్వ్​, మారుతీ షేర్లు లాభాలను గడించాయి.
  • రిలయన్స్ ఇండస్ట్రీస్​ (2.3 శాతానికిపైగా), ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, హెచ్​యూఎల్, ఎం&ఎం నష్టాల మూటగట్టుకున్నాయి.

11:48 September 13

స్టాక్ మార్కెట్లు నష్టాల్లో స్థిరంగా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 190 పాయింట్లకుపైగా కోల్పోయి 58,109 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ దాదాపు 50 పాయింట్లు తగ్గి 17,320 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది.

గరిష్ఠ స్థాయిల వద్ద సూచీలు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొంటున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. దీనికి తోడు హెవీ వెయిట్ షేర్లు కూడా నష్టాలకు కారణం అవుతున్నట్లు విశ్లేషిస్తున్నారు.

  • టీసీఎస్, మారుతీ, భారతీ ఎయిర్​టెల్, హెచ్​డీఎఫ్​సీ, ఎన్​టీపీసీ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
  • రిలయన్స్ ఇండస్ట్రీస్​ షేర్లు 2 శాతానికిపైగా నష్టంతో ట్రేడవుతున్నాయి. జియో-గూగుల్​ బడ్జెట్​ ఫోన్ అయిన.. జియోఫోన్​ నెక్ట్స్​ విడుదలను వాయిదా వేయడం ఇందుకు కారణంగా తెలుస్తోంది. నిజానికి ఈ ఫోన్​ను సెప్టెంబర్​ 10 వినాయక చవితి సందర్భంగా విడుదల చేయాలని రిలయన్స్ జియో భావించింది. అయితే వివిధ కారణాలతో విడుదల తేదీని దాదాపు రెండు నెలలు వాయిదా వేసింది. ఫలితంగా రిలయన్స్ షేర్లపై ప్రతికూల ప్రభావం పడిందని నిపుణులు అంటున్నారు.
  • ఐసీఐసీఐ బ్యాంక్, ఎం&ఎం, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, యాక్సిస్​ బ్యాంక్, సన్​ ఫార్మా షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

09:04 September 13

Stock markets live updates

ఈ వారం తొలి సెషన్​ను  స్టాక్​ మార్కెట్లు నష్టాలతో ప్రారంభించాయి. అంతర్జాతీయంగా ప్రతికూల ప్రభావంతో సెన్సెక్స్​  233 పాయింట్లు కోల్పోయి 58,071కి చేరింది. నిఫ్టీ 70 పాయింట్లు నష్టపోయి 17,299 వద్ద ట్రేడవుతోంది. బ్యాంకింగ్, ఐటీ రంగ షేర్లు ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నాయి.

హిండాల్కో, హెచ్​డీఎఫ్​సీ, కోల్ ఇండియా, భారతీ ఎయిర్​టెల్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

రిలయన్స్, హెచ్​సీఎల్​ టెక్​, ఐసీఐసీఐ, ఇన్ఫోసిస్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి

Last Updated : Sep 13, 2021, 3:43 PM IST

ABOUT THE AUTHOR

...view details