తెలంగాణ

telangana

ETV Bharat / business

భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్​ సూచీలు - bse sensex live updates

stock markets live updates
స్టాక్​ మార్కెట్లు

By

Published : Dec 15, 2020, 9:30 AM IST

Updated : Dec 15, 2020, 10:50 AM IST

10:45 December 15

స్టాక్​ మార్కెట్లు భారీ నష్టాల దిశగా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్​ 361 పాయింట్ల కోల్పోయి 45,892కి పడిపోయింది. నిఫ్టీ 98 పాయింట్ల నష్టంతో 13,460వద్ద ట్రేడ్​ అవుతోంది. అల్ట్రాటెక్​ సిమెంట్​,​ విప్రో, హెచ్​సీఎల్​ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

టాటా మోటార్స్, హెచ్​యూసీ, ఐటీసీ, బ్యాంకింగ్ రంగ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

08:44 December 15

వరుస లాభాలకు బ్రేక్.. నష్టాల్లో స్టాక్ మార్కెట్​ సూచీలు

సోమవారం జీవనకాల గరిష్ఠం వద్ద ముగిసిన సూచీలు ఇవాళ నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ ప్రతికూల పవనాలతో  సెన్సెక్స్​ 135 పాయింట్లు తగ్గి 46,118కి పడిపోయింది. జాతీయ స్టాక్ ఎక్సేంజీ- నిఫ్టీ 36 పాయింట్లు క్షీణించి 13,521  వద్ద ట్రేడవుతోంది. బ్యాంకింగ్​ రంగ షేర్లు ఒత్తిడితో నష్టాల్లో కొనసాగుతున్నాయి.

Last Updated : Dec 15, 2020, 10:50 AM IST

ABOUT THE AUTHOR

...view details