స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 1,375 పాయింట్లు క్షీణించి 28 వేల 440 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 379 పాయింట్లు తగ్గి 8 వేల 281 వద్ద ముగిసింది.
మార్కెట్లకు మళ్లీ కరోనా దెబ్బ- సెన్సెక్స్ 1,375 పాయింట్లు పతనం - సెన్సెక్స్ టుడే
15:43 March 30
15:06 March 30
రికార్డు స్థాయి నష్టాల దిశగా..
సెషన్ ముగింపునకు ముందు స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ దాదాపు 1,515 పాయింట్లకు పైగా నష్టంతో 28 వేల 405 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 400 పాయింట్లకు పైగా కోల్పోయి 8,258 వద్ద కొనసాగుతోంది.
- బ్యాంకింగ్, ఆటో రంగాల్లో అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది.
- 30 షేర్ల ఇండెక్స్‌లో టెక్ మహీంద్రా, నెస్లే, హెచ్‌యూఎల్, యాక్సిస్ బ్యాంక్ లాభాల్లో ఉన్నాయి.
- బజాజ్ ఫినాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ, టాటా స్టీల్, ఎం&ఎం షేర్లు భారీ నష్టాల్లో ఉన్నాయి.
13:17 March 30
భారీ నష్టాలు..
మిడ్ సెషన్ తర్వాత స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ ఏకంగా 1,030 పాయింట్లకు పైగా నష్టంతో 28,782 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది. నిఫ్టీ 280 పాయింట్లకు పైగా క్షీణతతో 8,380 వద్ద కొనసాగుతోంది.
- టెక్ మహీంద్రా, హెచ్‌యూఎల్, నెస్లే, టీసీఎస్ లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.
- 30 షేర్ల ఇండెక్స్‌లో 5 కంపెనీలు మాత్రమే లాభాల్లో కొనసాగుతున్నాయి.
- బజాజ్ ఫినాన్స్ అత్యధికంగా 10 శాతం నష్టంతో ట్రేడవుతోంది.
- హెచ్‌డీఎఫ్‌సీ, ఎం&ఎం, టాటా స్టీల్, మారుతీ, హీరోమోటోకార్ప్ షేర్లు భారీ నష్టాల్లో ఉన్నాయి.
12:08 March 30
మళ్లీ భారీ నష్టాల్లోకి..
స్టాక్ మార్కెట్లు మిడ్ సెషన్‌లో భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ దాదాపు 830 పాయింట్ల నష్టంతో 28,985 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ దాదాపు 220 పాయింట్లు కోల్పోయి.. ప్రస్తుతం 8,442 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది.
30 షేర్ల ఇండెక్స్‌లో టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, టీసీఎస్, నెస్లే, హెచ్‌యూఎల్, ఐటీసీ మినహా మిగతా అన్ని కంపెనీలు నష్టాల్లోనే ఉన్నాయి.
బజాజ్ ఫినాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ, టాటా స్టీల్, ఎం&ఎం షేర్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
10:43 March 30
కాస్త వెనక్కి..
స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల నుంచి కాస్త కోలుకున్నాయి. సెన్సెక్స్ ప్రస్తుతం 370 పాయింట్లకు పైగా నష్టంతో 29, 440 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 100 పాయింట్లకు పైగా కోల్పోయి 8,556 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది.
09:45 March 30
మళ్లీ అవే భయాలు..
కరోనా భయాలు స్టాక్ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. సెషన్ ఆరంభంలోనే భారీ నష్టాలను నమోదు చేశాయి సూచీలు.
సెన్సెక్స్ ప్రస్తుతం 600 పాయింట్లకు పైగా నష్టంతో 29,211 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 180 పాయింట్లకు పైగా క్షీణతతో 8,478 వద్ద కొనసాగుతోంది. అగ్రరాజ్యం అమెరికా సహా ఐరోపాలో కరోనా వైరస్ వ్యాప్తి తార స్థాయికి చేరిన నేపథ్యంలో మదుపరులు అప్రమత్తత పాటిస్తున్నారు.
30 షేర్ల ఇండెక్స్‌లో ప్రస్తుతం టెక్ మహీంద్రా, టీసీఎస్, యాక్సిస్ బ్యాంక్, ఐటీసీ, హెచ్‌సీఎల్‌టెక్, నెస్లే ఇండియాలు లాభాల్లో ఉన్నాయి.
బజాజ్ ఫినాన్స్, ఎం&ఎం, ఓఎన్‌జీసీ, బజాజ్ ఆటో షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
09:17 March 30
కరోనా పంజా: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
స్టాక్ మార్కెట్లు వరుసగా 5వ సెషన్‌లో భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ దాదాపు 900 పాయింట్లు క్షీణించి 28 వేల 925 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 250 పాయింట్లు తగ్గి 8 వేల 400 వద్ద కొనసాగుతోంది.
కరోనా సంక్షోభంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకుందన్న ఐఎంఎఫ్ ప్రకటన మదుపర్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది. కరోనా కష్టాల నుంచి గట్టెక్కేందుకు కేంద్రప్రభుత్వం, రిజర్వు బ్యాంకు ప్రత్యేక ప్యాకేజీలు, ఉద్దీపన చర్యలు ప్రకటించినా... అవి పూర్తిస్థాయిలో భరోసా నింపలేకపోయాయి.