మూడోరోజూ లాభాలే..
స్టాక్ మార్కెట్లలో వరుసగా మూడో రోజూ లాభాల పరంపర కొనసాగింది. సెన్సెక్స్ 1,411 పాయింట్లు వృద్ధి చెంది చివరకు 29,947 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 324 పాయింట్ల లాభంతో 8,641 వద్దకు చేరింది.
కరోనా సంక్షోభం ప్రారంభమైనప్పటి నుంచి వరుస నష్టాల్లో ఉన్న ఇండస్‌ఇండ్ బ్యాంక్ నేడు రికార్డు స్థాయిలో 46 శాతం లాభాన్ని గడించింది. ఎల్&టీ, భారతీ ఎయిర్‌టెల్, బజాజ్ ఫినాన్స్ షేర్లు భారీగా లాభపడ్డాయి.
మారుతీ, టెక్ మహీంద్రా, సన్‌ఫార్మా, రిలయన్స్ షేర్లు నష్టాల్లో ముగిశాయి.