స్టాక్ మార్కెట్లు బుధవారం కూడా లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 355 పాయింట్లు బలపడి.. 40,616 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 95 పాయింట్ల వృద్ధితో 11,908 వద్దకు చేరింది.
అమెరికా ఎన్నికల ఫలితాల సరళి డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి బైడెన్‌కు అనుకూలంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఐటీ షేర్లు సానుకూలంగా స్పందించాయి. ఫార్మా షేర్ల జోరు కూడా లాభాలకు కారణంగా తెలుస్తోంది. భారీ నష్టాల నుంచి తేరుకుని సానుకూలంగా స్పందించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు.. లాభాలకు ఊతమందించినట్లు స్టాక్ బ్రోకర్లు చెబుతున్నారు.
ఇంట్రాడే సాగిందిలా
సెన్సెక్స్ 40,693 పాయింట్ల అత్యధిక స్థాయి, 40,076 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 11,930 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 11,756 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
ఇండస్ఇండ్ బ్యాంక్, సన్‌ఫార్మా, రిలయన్స్, ఇన్ఫోసిస్, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.