వారాంతపు సెషన్లో స్టాక్ మార్కెట్లు ఆరంభం నుంచే లాభనష్టాల మధ్య దోబూచులాడినా.. చివరకు లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 86 పాయింట్లు పెరిగి.. 43,443 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 29 పాయింట్ల లాభంతో 12,720 వద్దకు చేరింది.
ఆర్థిక షేర్లు చివరి గంటలో పుంజుకోవడం లాభాలకు కారణంగా తెలుస్తోంది. హెవీ వెయిట్ షేర్లూ లాభాలకు దన్నుగా నిలిచాయి.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 43,522 పాయింట్ల అత్యధిక స్థాయి, 43,053 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 12,736 పాయింట్ల గరిష్ఠ స్థాయి 12,607 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
- బజాజ్ ఫిన్సర్వ్, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫినాన్స్, ఎస్బీఐ షేర్లు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.
- ఎల్&టీ, హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, టెక్ మహీంద్రా షేర్లు నష్టపోయాయి.