తెలంగాణ

telangana

ETV Bharat / business

మార్కెట్లలో లాభాల జోరు- 13,100పైకి నిఫ్టీ - షేర్ మార్కెట్ వార్తలు

వ్యాక్సిన్​పై ఆశలు, ఆర్థిక వృద్ధి రికవరీపై సానుకూల అంచనాలతో స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ 506 పాయింట్లు బలపడి.. 44,650పైకి చేరింది. నిఫ్టీ 140 పాయింట్ల లాభంతో 13,100 మార్క్​ను దాటింది.

Stock markets update
స్టాక్ మార్కెట్ల లాభాలకు కారణాలు

By

Published : Dec 1, 2020, 3:46 PM IST

స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాలతో ముగిశాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్ 506 పాయింట్లు బలపడి 44,655 వద్దకు చేరింది. ఎన్​ఎస్​ఈ- నిఫ్టీ 140 పాయింట్ల లాభంతో 13,109 వద్ద స్థిరపడింది.

కొవిడ్ వ్యాక్సిన్​పై​ ఆశలు సహా.. దేశ ఆర్థిక వ్యవస్థ అంచనాలకన్నా వేగంగా పుంజుకుంటున్నట్లు వస్తున్న నివేదికలు మదుపరుల్లో ఉత్సాహం నింపాయి. నవంబర్​లో జీఎస్​టీ వసూళ్లు మళ్లీ రూ.లక్ష కోట్లు దాటడం కూడా లాభాలకు కలిసొచ్చినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

మంగళవారం సెషన్​లో దాదాపు అన్ని రంగాలు సానుకూలంగా స్పందించాయి. ఫార్మా, బ్యాంకింగ్, ఐటీ షేర్లు ఎక్కువగా లాభాలను నమోదు చేశాయి.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్ 44,731 పాయింట్ల అత్యధిక స్థాయి, 44,118 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 13,128 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 12,962 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

సన్​ఫార్మా, ఇండస్​ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా, ఓఎన్​జీసీ, భారతీ ఎయిర్​టెల్, ఇన్ఫోసిస్ షేర్లు లాభలను గడించాయి.

కోటక్ మహీంద్రా బ్యాంక్, నెస్లే, టైటాన్​, బజాజ్​ ఫినాన్స్, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, బజాజ్ ఫిన్​సర్వ్​ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి

ఇతర మార్కెట్లు

ఆసియాలో ఇతర ప్రధాన స్టాక్ మార్కెట్లు అయిన షాంఘై, టోక్యో, సియోల్, హాంకాంగ్ సూచీలు మంగళవారం లాభాలను గడించాయి.

ఇదీ చూడండి:మళ్లీ రూ.లక్ష కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు

ABOUT THE AUTHOR

...view details