ఆరంభంలో లాభాలతో ఊరించిన స్టాక్ మార్కెట్లు.. చివరకు నష్టాలతో ముగిశాయి. శుక్రవారం సెషన్లో బీఎస్ఈ-సెన్సెక్స్ 134 పాయింట్లు తగ్గి 39,845 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 11 పాయింట్ల స్వల్ప నష్టంతో 11,505 వద్ద నిలిచింది.
ఆసియా మార్కెట్ల సానుకూలతలతో వారాంతపు సెషన్ ఆరంభంలో లాభాలను నమోదు చేశాయి స్టాక్ మార్కెట్లు. అయితే చివరి గంటలో మదుపరులు లాభాల స్వీకరణకు దిగటం నష్టాలకు కారణంగా తెలుస్తోంది.
ఇంట్రాడే సాగిందిలా
సెన్సెక్స్ 39,200 పాయింట్ల అత్యధిక స్థాయి, 38,635 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 11,584 పాయింట్ల గరిష్ఠ స్థాయి నుంచి 11,446 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
భారతీ ఎయిర్టెల్, ఎం&ఎం, టెక్ మహీంద్రా, ఎన్టీపీసీ, సన్‌ఫార్మా, ఓఎన్జీసీ షేర్లు లాభాలను గడించాయి.