తెలంగాణ

telangana

ETV Bharat / business

ఐదో రోజూ అదే జోరు- సెన్సెక్స్@39,879

సెషన్ ఆరంభంలో ఒడుదొడుకులు ఎదుర్కొన్నా.. వరుసగా ఐదో రోజూ లాభాలతో ముగిశాయి స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 304 పాయింట్లు బలపడి.. 39,900కి చేరువైంది. నిఫ్టీ 76 పాయింట్లు పెరిగింది. రిలయన్స్, టీసీఎస్​ సహా ఇతర హెవీ వెయిట్ షేర్లు బుధవారం లాభాలకు దన్నుగా నిలిచాయి.

share Market news
నేటి స్టాక్ మార్కెట్ వార్తలు

By

Published : Oct 7, 2020, 3:50 PM IST

Updated : Oct 7, 2020, 3:55 PM IST

స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 304 పాయింట్లు పుంజుకుని.. 39,879 వద్దకు చేరింది. ఎన్​​ఎస్​ఈ-నిఫ్టీ 76 పాయింట్ల లాభంతో 11,739 వద్ద సెషన్​ను ముగించింది.

ఉద్దీపన ప్యాకేజీపై ప్రస్తుతానికి చర్చించే వీలులేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటతో.. అంతర్జాతీయంగా ప్రతికూలతలు నెలకొని.. ఆరంభంలో సూచీలు కాస్త ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి. అయితే వరుస పెట్టుబడులతో జోరుమీదున్న రిలయన్స్​ ఇండస్ట్రీస్, దేశంలో రెండో అతిపెద్ద లిస్టెడ్ కంపెనీ టీసీఎస్​ సహా ఇతర హెవీ వెయిట్ షేర్లు సానుకూలంగా స్పందించి బుధవారం లాభాలకు దన్నుగా నిలిచాయి.

ఇంట్రాడే సాగిందిలా

సెన్సెక్స్ 39,968 పాయింట్ల అత్యధిక స్థాయి, 39,451 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 11,763 పాయింట్ల గరిష్ఠ స్థాయి;11,629 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

టైటాన్​, బజాజ్ ఆటో, మారుతీ, రిలయన్స్, ఓఎన్​జీసీ, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.

బజాజ్ ఫినాన్స్, పవర్​ గ్రిడ్, టాటా స్టీల్, ఎన్​టీపీసీ, సన్​ఫార్మా షేర్లు నష్టాలను నమోదు చేశాయి.

ఆసియా మార్కెట్లు

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లు అయిన సియోల్, హాంకాంగ్ సూచీలూ బుధవారం లాభపడ్డాయి. టోక్యో సూచీ మాత్రం నష్టాలతో ముగిసింది.

రూపాయి, ముడి చమురు

కరెన్సీ మార్కెట్​లో రూపాయి బుధవారం 13 పైసలు పుంజుకుంది. దీనితో డాలర్​తో పోలిస్తే మారకం విలువ 73.33 వద్దకు చేరింది.

ముడి చమురు ధరల సూచీ-బ్రెంట్ 1.27 శాతం తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్​లో బ్యారెల్ ముడి చమురు ధర 42.11 డాలర్లుగా ఉంది.

ఇదీ చూడండి:ఈ సారి రెపో రేటుపై ఆర్​బీఐ నిర్ణయం అదేనా?

Last Updated : Oct 7, 2020, 3:55 PM IST

ABOUT THE AUTHOR

...view details