తెలంగాణ

telangana

ETV Bharat / business

స్టాక్ మార్కెట్లకు భారీ లాభాలు- 10,800 పైకి నిఫ్టీ - సెన్సెక్స్

స్టాక్ మార్కెట్లు చివరి సెషన్ నష్టాల నుంచి గట్టెక్కి.. గురువారం భారీ లాభాలను గడించాయి. సెన్సెక్స్ 409 పాయింట్లు బలపడింది. నిఫ్టీ 108 పాయింట్లు పుంజుకుంది. ఎఫ్​ఎంసీజీ మినహా దాదాపు అన్ని రంగాలు సానుకూలంగా ముగిశాయి.

STOCKS TODAY
నేటి స్టాక్ మార్కెట్లు

By

Published : Jul 9, 2020, 3:43 PM IST

స్టాక్ మార్కెట్లు గురువారం భారీ లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూలతో ఆరంభం నుంచే సూచీల జోరు కనిపించింది.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 409 పాయింట్లు బలపడి 36,738 వద్దకు చేరింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 108 పాయింట్ల లాభంతో 10,813 వద్ద స్థిరపడింది.

ఆర్థిక, లోహ రంగ షేర్ల ర్యాలీ లాభాలకు దన్నుగా నిలిచాయి. సెషన్ ఆరంభంలో ఒడుదొడుకులు ఎదుర్కొన్న రిలయన్స్ షేర్లు.. చివరి గంటలో పుంజుకోవడం భారీ లాభాలకు కారణంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్ 36,806 పాయింట్ల అత్యధిక స్థాయి, 36,422 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 10,826 పాయింట్ల గరిష్ఠ స్థాయి.., 10,733 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

ఎస్​బీఐ, బజాజ్ ఫినాన్స్, హెచ్​డీఎఫ్​సీ, టాటా స్టీల్, బజాజ్ ఫిన్​సర్వ్, హెచ్​సీఎల్​టెక్ లాభపడ్డాయి.

ఓఎన్​జీసీ, టెక్ మహీంద్రా, హెచ్​యూఎల్​, మారుతీ, నెస్లే షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.

రూపాయి..

కరెన్సీ మార్కెట్​లో రూపాయి గురువారం 3 పైసలు బలపడింది. డాలర్​తో పోలిస్తే మారకం విలువ రూ.74.99 వద్ద ఫ్లాట్​గా స్థిరపడింది.

ఇదీ చూడండి:ఆ పాలసీతో ఉద్యోగం పోయినా ఆర్థిక అండ!

ABOUT THE AUTHOR

...view details