ఒడుదొడుకుల ట్రేడింగ్లో స్టాక్ మార్కెట్లు మంగళవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 45 పాయింట్లు పెరిగి 38,844 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 6 పాయింట్ల లాభంతో 11,472 వద్ద ఫ్లాట్గా ముగిసింది.
ఇటీవలి లాభాలను మదుపరులు సొమ్ము చేసుకునే పనిలో పడటం, ఆగస్టు నెల డెరివేటివ్స్ గడువు ముగియనున్న నేపథ్యంలో మార్కెట్లు సెషన్ మొత్తం ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ పవనాలు కూడా ఇందుకు కారణమయ్యాయి. ఆర్థిక షేర్లలో నమోదైన కొనుగోళ్లతో చివరకు స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి సూచీలు.
ఇంట్రాడే సాగిందిలా
సెన్సెక్స్ 39,009 పాయింట్ల అత్యధిక స్థాయి, 38,680 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 11,526 పాయింట్ల గరిష్ఠ స్థాయి;11,423 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
బజాజ్ ఫినాన్స్, ఎస్బీఐ, టెక్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫిన్సర్వ్, ఇండస్ఇండ్ బ్యాంక్ లాభాలను గడించాయి.