స్టాక్ మార్కెట్లు వారాంతంలో భారీ లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 548 పాయింట్లు వృద్ధిచెంది 37,020 వద్దకు చేరింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 162 పాయింట్ల స్వల్ప లాభంతో 10,902 వద్ద స్థిరపడింది.
రిలయన్స్ సహా హెవీ వెయిట్ షేర్లలో చివరి గంటలో నమోదైన కొనుగోళ్లు లాభాలకు ప్రధాన కారణం. ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో జపాన్ సూచీ మినహా.. చైనా, హాంకాంగ్, దక్షిణ కొరియా సూచీలు లభాలతో ముగిశాయి.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 37,109 పాయింట్ల అత్యధిక స్థాయి, 36,513 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 10,930 పాయింట్ల గరిష్ఠ స్థాయి;10,750 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.