తెలంగాణ

telangana

ETV Bharat / business

ట్రంప్ శాంతి ప్రకటనతో లాభాల్లో స్టాక్​ మార్కెట్లు

ఇరాన్​తో శాంతిని కోరుకుంటామన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ ప్రకటనతో మార్కెట్లు లాభాల బాట పట్టాయి. ఐటీ మినహా బ్యాంకింగ్, ఇన్​ఫ్రా, వాహన, లోహ, ఇంధన రంగాలు జోరుమీదున్నాయి.

stock market today
ట్రంప్ శాంతి ప్రకటనతో లాభాల్లో స్టాక్​ మార్కెట్లు

By

Published : Jan 9, 2020, 10:03 AM IST

దేశీయ స్టాక్ ​మార్కెట్లు గురువారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఐటీ మినహా బ్యాంకింగ్, ఇన్​ఫ్రా, వాహన, లోహ, ఇంధన రంగాలు సూచీలను పరుగులు పెట్టిస్తున్నాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ (సెన్సెక్స్​) 471 పాయింట్లు వృద్ధి చెంది 41వేల 288 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ (నిఫ్టీ) 139 పాయింట్లు లాభపడి 12 వేల 165కు చేరుకుంది.

యూఎస్​ సైనిక స్థావరాలపై ఇరాన్​ దాడిచేసిన తరువాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శాంతికి ముందడుగు వేశారు. ఉగ్రసంస్థ 'ఇస్లామిక్​ స్టేట్'పై ఇరాన్​ కలిసి రావాలని పిలుపునిచ్చారు. ట్రంప్​ ప్రకటనతో మదుపరుల సెంటిమెంట్ బలపడి కొనుగోళ్లు ఊపందుకున్నాయి.

లాభనష్టాల్లో

ఇండస్​ఇండ్ బ్యాంకు, ఎస్​బీఐ, టాటా స్టీల్​, ఐసీఐసీఐ బ్యాంకు, ఎల్​ అండ్ టీ, యాక్సిస్​ బ్యాంకు భారతీ ఇన్​ఫ్రాటెల్, ఐఓసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్​, హెచ్​డీఎఫ్​సీ ట్విన్స్, బీపీసీఎల్ రాణిస్తున్నాయి.

టీసీఎస్​, విప్రో, హెచ్​సీఎల్ టెక్, టెక్​ మహీంద్రా నష్టాల్లో కొనసాగుతున్నాయి.

ఆసియా మార్కెట్లు

అంతర్జాతీయ సానుకూల పవనాలతో ఆసియా మార్కెట్లు... జపాన్​, కోస్పీ, హాంకాంగ్​, చైనా మార్కెట్లు లాభాల్లో సాగుతున్నాయి. వాల్​ స్ట్రీట్​ కూడా బుధవారం లాభాలతో ముగిసింది.

రూపాయి విలువ

రూపాయి విలువ 22 పైసలు పెరిగి, ఒక డాలరుకు రూ.71.47గా ఉంది.

ముడిచమురు

అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు 0.69 శాతం పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్ ధర 65.89 డాలర్లుగా ఉంది.

ఇదీ చూడండి: ప్రజలకు మంచి చేసే అంకురాలకు పెట్టుబడులు

ABOUT THE AUTHOR

...view details