భారీ నష్టాల దిశగా స్టాక్‌మార్కెట్లు
ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లు తగ్గించినట్లు ప్రకటించినా... దేశీయ మార్కెట్లు భారీ నష్టాల్లోకి జారుకుంటున్నాయి. కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరిగిపోతుండడం, ఆర్థిక మాంద్యం భయాలు, విదేశీ పెట్టుబడులు తరలివెళుతుండడమే ఇందుకు కారణం.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంచి సూచీ సెన్సెక్స్ 348 పాయింట్లు కోల్పోయి 30 వేల 584 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 89 పాయింట్లు నష్టపోయి 9 వేల 16 వద్ద ట్రేడవుతోంది.
లాభనష్టాల్లో..
ఇన్ఫోసిస్, ఎస్బీఐ, రిలయన్స్, హీరో మోటోకార్ప్, టెక్ మహీంద్రా, రిలయన్స్, సన్‌ఫార్మా, టైటాన్ రాణిస్తున్నాయి.
టాటా స్టీల్, ఐటీసీ, ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, హెచ్డీఎఫ్సీ ట్విన్స్, ఎల్ అండ్ టీ నేలచూపులు చూస్తున్నాయి.
ఆసియా మార్కెట్లు
అమెరికా చైనా ఉద్రిక్తతల నడుమ షాంఘై, టోక్యో, సియోల్ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. హాంగ్‌కాంగ్ నగర భద్రత చట్టాన్ని రూపొందించడానికి చైనా సన్నద్ధమవుతున్న నేపథ్యంలో హాంగ్‌కాంగ్ మార్కెట్లు భారీ నష్టపోతున్నాయి. మరోవైపు వాల్ స్ట్రీట్ కూడా నష్టాలతో ముగిసింది.
ముడిచమురు
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర 3.72 శాతం తగ్గింది. ప్రస్తుతం బ్యారెల్ ధర 34.72 డాలర్లుగా ఉంది.